
Raghuramakrishna
Raghuramakrishna : మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 25న తదుపరి విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సీఐడీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ తమకు గురువారమే అందిందని, రిజాయిండర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని విజయ్ పాల్ తరపు న్యాయవాదులు కోరారు. ఈ క్రమంలో రెండు వారాలు గడువు ఇస్తున్నట్లు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం తెలిపింది. ఈ నెల 25న తుది విచారణ చేపడతామని పేర్కొంది. ఆ తర్వాత వాయిదాలు ఉండవని, ఆరోజే అన్ని విషయాలపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది.