Raghurama : రఘురామకు హఠాత్తుగా జగన్ పై ప్రేమ.. షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ.. కూటమిలో కలవరం..
Raghurama : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్, హుండీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు మధ్య ఆసక్తికర దృశ్యాలు మీడియా కంటికి చిక్కాయి.
జగన్ పాలించిన ఐదేళ్లు జగన్ మీద నిప్పులు చెరుగుతూ సోషల్ మీడియాలో రోజు రోజు రచ్చ చేసే ఆర్ఆర్ఆర్ జగన్ దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి ముచ్చటించారు. అయితే, రఘురామ జగన్ తో ఏ విషయాల గురించి ప్రస్తావించి ఉంటారన్న దానిపై చర్చ జరుగుతోంది.
గత ప్రభుత్వంలో అప్పటి జగన్ సహకారంతో తనపై హత్యాయత్నం జరిగిందంటూ కేసుల మీదు కేసులు పెట్టిన రఘురామ ఇప్పుడు హత్యకు యత్నించిన జగన్ తో చేతులు కలిపి మరీ ముచ్చటించడంతో వీరి సంభాషణను ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
ప్రతీ రోజూ అసెంబ్లీకి రావాలని తను సూచించానని, ఇది మర్యాద పూర్వక కలయిక మాత్రమే అని రఘురామ స్పందించారు. ఇన్నాళ్లు జగన్ ను సోషల్ మీడియా వేదికగా విమర్శించిన రఘురామ అసెంబ్లీ వేదికగా జగన్ ను ర్యాగింగ్ చేస్తున్నారా? ఇందులో భాగంగానే ప్రతిరోజూ అసెంబ్లీకి రావాలని జగన్ కు సలహాలిచ్చారా..? అందునా తాను జగన్ పక్క సీట్లో కూర్చోవాలని తన అభీష్టాన్ని మీడియా ముందు ప్రకటించి అటు వైసీపీని ఇటు టీడీపీని మరింత ఆశ్చర్యపరిచారు రఘురామ.
తను ఏ పార్టీ సీటుతో గెలుస్తాడో అదే పార్టీకి రెబల్ గా మారడం రఘురామకు సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో రఘురామ జగన్ ను కలవడం కూటమిని కంగారు పెట్టిస్తోంది.
ఐదేళ్లుగా వైసీపీపై పెంచుకున్న పగకు ప్రతీకారం తీర్చుకునేందుకు రఘురామా జగన్ ను కలిసేందుకు ముందడుగు వేశారా? లేక రఘురామకు కొత్తగా జగన్ మీద ప్రేమ పుట్టిందా..? అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.