Raghu Rama Krishna Raju : టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా రఘురామకృష్ణరాజు పోటీ – ఉండి నియోజకవర్గం నుంచి పోటీ..?

Raghu Rama Krishna Raju
Raghu Rama Krishna Raju : టీడీపీ నేత రఘురామకృష్ణరాజుకు టీడీపీ అసెంబ్లీ సీటు అధిష్టానం ఖరారం చేసినట్లు, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన అధిష్టానం తనను ఆదేశించిందని ఆయన తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పనిచేస్తానని అన్నారు. టీడీపీ అధిష్టానం నుంచి బీఫాం అందుకున్న తర్వాత ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఏపీ రాజకీయాలలో ఎంపీ రఘురామకృష్ణరాజుకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. సీఎం జగన్ ను ఎదుర్కొన్న నేతగా ఆయనకు ప్రజల్లో గుర్తింపు ఉంది. ఆయన ఎప్పటి నుంచో టీడీపీ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న నర్సాపురం లోక్ సభ సీటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో బీజేపీ శ్రీనివాస్ వర్మకు కేటాయించింది. దీంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎట్టకేలకు రఘురామకృష్ణరాజుకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది.