JAISW News Telugu

Raghurama : రఘురామ ఆ పార్టీ నుంచే బరిలోకి? ఎక్కడ నుంచో తెలుసా?

Raghurama Krishnam Raju

Raghurama Krishnam Raju

Raghurama Krishnam Raju : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. పార్టీలు తమ టికెట్ల కేటాయింపులో లెక్కలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు ఎలా ఉంటుందనే దానిపై వ్యూహాలు రచిస్తున్నాయి. తమ గెలుపు గుర్రాలను వెతికే పనిలో పడుతున్నాయి. ఎవరి ప్రాధాన్యం ఎంతో తెలుసుకుని మరీ టికెట్లు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు నర్సాపురం టికెట్ పై పలు అనుమానాలు వస్తున్నాయి.

నర్సాపురం ఎంపీ రఘురామ క్రిష్ణంరాజుకు బీజేపీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆయనకు చంద్రబాబు టీడీపీ అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి సమ్మతించారు. రఘురామకు ఎంపీ సీటుపైనే గురి ఉన్నా చంద్రబాబు సూచన మేరకు అసెంబ్లీకి అంగీకరించినట్లు సమాచారం.

పొత్తులో భాగంగా నర్సాపురం టికెట్ బీజేపీకి ఖరారైంది. ఇక్కడ నుంచి శ్రీనివాస్ వర్మ బరిలో నిలిచారు. దీంతో బీజేపీ అభ్యర్థిని మార్చడానికి అంగీకరించలేదు. దీని వల్ల రఘురామ ఆశలకు గండి పడింది. కానీ బాబు అసెంబ్లీ టికెట్ కేటాయిస్తానని చెప్పడంతో రఘురాము సమ్మతించారు. టీడీపీ టికెట్ పై అసెంబ్లీకి వెళ్తే ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పదవి ఇస్తామనే ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

నర్సాపురం పరిధిలో రఘురామకు ఉన్న ఇమేజ్ పార్టీకి కలిసి వస్తుందని బాబు ఆశిస్తున్నారు. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పీవీఎల్ నర్సింహ రాజు పోటీలో నిలిచారు. టీడీపీ అభ్యర్థిగా రఘురామకు అవకాశం వస్తోంది. ఈ నేపథ్యంలో గెలుపుపై ఇరు పార్టీల అంచనాలు పెరుగుతున్నాయి. విజయం తమదంటే తమదే అనే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రఘురామ తమ పార్టీ భవిష్యత్ కు బంగారు కొండలా అండగా నిలుస్తారని బాబు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయనను టీడీపీలో చేర్చుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో జరుగుతున్న పరిణామాలు కీలకంగా మారుతున్నాయి.

Exit mobile version