Fighter Jets : ఫ్రెంచ్ గయానాలోని కోరోవ్ లోని ఐరోపా స్పేస్ పోర్టు నుంచి ఏరియన్ 6 అనే రాకెట్ జూలై 9న ఉపగ్రహాలను మోసుకెళ్లింది. ముందుగా నిర్దేశించిన సమయం కంటే గంట ఆలస్యంగా ఈ రాకెట్ నింగిలోకి వెళ్లింది. అయితే కొద్ది నిమిషాల తర్వాత ఈ ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తింది. చివరి పేలోడ్ విడుదల చేయకుండా యూరప్ బాహ్య అంతరిక్షంలోకి తిరిగి వచ్చినట్లు గుర్తించబడింది. అంటే రాకెట్ నిర్ణీత మార్గం కాకుండా దారి తప్పింది. అంతా సజావుగా సాగుతున్న సమయంలో సమస్య తలెత్తింది. అప్పటికే అది భూ వాతావరణాన్ని దాటింది. తిరిగి భూవాతావరణంలోకి తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఫైటర్ జెట్లను రంగంలోకి దింపాల్సి వచ్చింది. రాకెట్ దూసుకెళ్తుండగా రఫేల్ యుద్ధ విమానాలు దానిని అనుసరించాయి.
ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన శాస్త్రవేత్తల బృందం.. ఫ్రాన్స్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ హెల్ప్ తీసుకుంది. దీంతో ప్రయోగానికి ముందే ఎయిర్ ఫోర్స్ అక్కడ మోహరించింది. మూడు రఫేల్ యుద్ధ విమానాలు, రెండు యూరోకాప్టర్ ఫెన్నిక్స్, జర్మనీకి చెందిన ఒక పూమా ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్ గాల్లోకి ఎగిరాయి. రాకెట్ ప్రయాణిస్తున్న మార్గంలో ఇవన్నీ రక్షణ వలయంలా వెళ్లాయి. దారితప్పిన రాకెట్ కారణంగా గగనతలం లేదా భూమిపై ప్రమాదం చోటు చేసుకోకుండా ఉండేందుకు వీటిని దాని వెంట పంపించారు.
అయితే, అదృష్టవశాత్తూ అలాంటిదేమీ లేకుండా రాకెట్ సముద్రంలో కూలిపోయింది. రాకెట్‌కు తోడుగా వెళ్తున్న దృశ్యాలు రఫేల్ జెట్ కాక్‌పిట్‌లో రికార్డ్ అయ్యాయి. వాటిని ఫ్రాన్స్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆపరేషన్ విజయవంతమైందని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన వారు వావ్ అంటున్నారు. హాలీవుడ్ సినిమాలకు మించి ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.
Mardi 9 juillet 2024, à 16 heures, heure locale, la fusée #Ariane6 a été lancée depuis le Centre spatial guyanais, à Kourou. Avec six de ses aéronefs, l’AAE a contribué à la protection de cette « opération névralgique ».
Retour sur cette mission accomplie avec succès. 🎥⤵️ pic.twitter.com/9lQEeHUBeK
— Armée de l’Air et de l’Espace (@Armee_de_lair) July 19, 2024