Radhika Apte : సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామర్ ఫీల్డ్ అని అందరూ భావిస్తుండటంలో తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఇండస్ట్రీ అలాగే తయారైందని చూస్తూనే అందరికీ తెలుస్తోంది. ఒకప్పుడు అవకాశాలు అందాలను, కమిట్ మెంట్లను చూసి కాకుండా ట్యాలెంట్ ను చూసి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు లేకుండా పోయాయని చెబుతున్నారు కొందరు.
ఇప్పుడు ఎవరు కమిట్ మెంట్లు ఇవ్వగలుగుతారో అలాంటి వారికే అవకాశాలు దక్కుతాయి తప్ప ఇంక ఎవరికీ దక్కవని అర్థం అవుతోంది. అయితే ఇలాంటి కమిట్ మెంట్లు ఇచ్చి ఛాన్సులు పట్టుకోవడంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతూ ఉంటారు. తాజాగా బోల్డ్ హీరోయిన్ రాధికా ఆప్టే కూడా దానిపై తన వెర్షన్ చెప్పి అందరికీ షాక్ ఇచ్చిందని అనిపిస్తోంది.
ఆమె పేరు వింటేనే బోల్డ్ నెస్ కు మరోపేరు అనేలా ఉంటుంది. ఎందుకంటే ఆమె నటించిన పాత్రలు అలా ఉంటాయి మరి. ఎన్నో సినిమాల్లో తనలోని బోల్డ్ నెస్ ను చూపించేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఆమె కాస్టింగ్ కౌచ్, కమిట్ మెంట్ల మీద ఓ ఇంటర్వ్యూలో మాట్లాడి తన మనసులోని విధానాలను బయట పెట్టేసింది.
ఆమె మాట్లాడుతూ.. ఒక్కో సమయంలో ఒక్కో రకమైన ఇబ్బందులు ఉంటాయి. వాటిని అధిగమించడం కోసం కొన్ని సార్లు ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం కొందరు కమిట్ అవుతారు. అందులో తప్పు లేదు. ఎందుకంటే అక్కడ ఇద్దరి ఇష్టపూర్వకంగానే అన్నీ జరుగుతాయి. కాబట్టి కమిట్ మెంట్లు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదని అనిపిస్తోందంటూ తెలిపింది ఈ బ్యూటీ.