JAISW News Telugu

Radha Krishna : బాబును ఇలా కూడా బద్నాం చేయచ్చని చూపిన ఆర్కే!

Radha Krishna : ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ (ఆర్కే) ‘కొత్త పలుకు’లో భిన్న స్వరం కనిపిస్తోంది. ఆయన పత్రికలో రోజువారీగా ఒకటి చేస్తారు.. తర్వాత అది తప్పేం కాదని మరో ఆర్టికల్ రాస్తారు. పనిలో పనిగా.. టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ఏదో చేస్తున్నారన్న పుకార్లను ప్రజల్లోకి పంపుతున్నారు. రివర్స్ లో అలాగే చేయాలని సలహాలిస్తున్నారు. ఈ వారం ‘కొత్త పలుకు’ ఆర్టికల్ లో చంద్రబాబును ఎలా బద్నాం చేయాలో సాక్షి కూడా ఆర్కే నుంచి తెలుసుకోవాల్సిన అంశాలను వివరించాడు.

వైసీపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న అధికారులే.. టీడీపీ సర్కారులోనూ అంతే కీలకంగా వ్యవహరిస్తున్నారని.. వారం, పది రోజులుగా ఆంధ్రజ్యోతి పత్రిక రాయని సందర్భం లేదు. చివరికి లోకేశ్ పేషీపైనా నిందలేశారు. వీటిని చూసి, చదివి టీడీపీ సానుభూపతిపరులు ఇంత జరుగుతుందా? అనుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులన్నింటినీ క్రోడీకరించి టీడీపీ క్యాడర్ లో అసంతృప్తి ఉందని ఆర్కే ‘కొత్త పలుకు’ వినిపించాడు. అంతేనా.. అధికారులు వాళ్లే ఉంటారని.. ఉన్న వాళ్లలో మంచి వాళ్లను వెతికి వారితో పని చేయించుకోవడం ప్రభుత్వ విధానమని క్యాడర్ గుర్తించాలని సలహా ఇచ్చారు. అంటే ఇక్కడ ఆంధ్రజ్యోతి పత్రికనే ఒక విషయాన్ని క్రియేట్ చేసింది. కవరింగ్ ఇస్తున్నట్లు చివరికి ఆర్కేనే రాసుకొచ్చారు. అసలు ప్రభుత్వ అధికారుల్లో ఎవరు ఏం చేశారో.. టీడీపీ వాళ్ల కంటే.. ఆంధ్రజ్యోతికి ఎక్కువ తెలుస్తుందా..?

ఇదే కాదు.. ఫలనా ఎమ్మెల్యే నాలుగు బార్లు లాగేసుకున్నారని.. మరో ఎమ్మెల్యే కప్పం కట్టమని ఆదేశించారని ఇలా పుకార్లను రాసుకొచ్చారు. ఇలాంటివి చేసినందుకే మాజీ సీఎం అయిన జగన్ ను ఓడించారని మళ్లీ కబుర్లు. మళ్లీ ఇదే ఆర్టికల్ లో.. వైసీపీ నేతలు.. టీడీపీ సానుభూతిపరులు.. ఇతరుల వ్యాపారాలను లాగేసుకున్నారని వారికి మళ్లీ తిరిగి ఇప్పించాల్సి ఉందని రాసుకచ్చారు. ఆ ఎమ్మెల్యే లాగేసుకున్న నాలుగు బార్లు టీడీపీ వాళ్ల దగ్గర వైసీపీ వాళ్లు లాక్కున్నవేనని అనుకోకూడదు? ఏపీలో బార్ల బిజినెస్ ను వదిలించుకోవడానికే వ్యాపారులు ఆసక్తిగా ఉన్నారు. వాటి కోసం బెదిరించాల్సిన అవసరం లేదని అందరికీ తెలిసిందే. చాలా మంది లైసెన్స్ ఫీజులు కట్టలేకపోతున్నారు. కానీ ఆర్కేకు మాత్రం లాగేసుకుంటున్నారని అనిపించింది.

జగన్ చేసినట్లుగా చేయాలని టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారని ఆర్కే చెప్పుకచ్చారు. అలాంటి పరిస్థితిని తెచ్చింది.. ఒక రకంగా ఆంధ్రజ్యోతినే. వైసీపీ సానుభూతిపరులే ఇంకా రాజ్యం ఏలుతున్నారని, ప్రతి రోజూ రాసి .. వారిలోఅసంతృప్తి పెంచారు. తీరా వారాంతంలో ఆయన నీతులు చెబుతూ తెరపైకి వస్తున్నారు. టీడీపీకి ఎక్కడో మూల సుద్దులు చెబుతున్నట్లుగా ఆయన రాసుకస్తున్న ఆర్టిక్లల్స్.. నిజానికి టీడీపీని టార్గెట్ చేసినట్లుగా ఎవరికైనా అనిపిస్తుంది. ప్రభుత్వం ప్రారంభమై నె మాత్రమే గడించింది. మళ్లీ ఏదేదో చెబుతూంటారు. మొత్తంగా ఆయన ఫ్రస్ట్రేషన్.. తనకు చేతనైన పద్ధతిలో ప్రతి వారం చూపుతున్నారు. దానికి కారణం ఏంటో.. ఆయనకు.. ఆయన సన్నిహితులకు.. టీడీపీ పెద్దలకే తెలియాలి.

Exit mobile version