Raashii Khanna : అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఊహలు గుసగుసలాడే’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది బూరె బుగ్గల చిన్నది రాశీ ఖన్నా. ఇక, గోపీచంద్‌తో నటించిన ‘జిల్’తో తెలుగు సినీ అభిమానులకు దగ్గరైంది. ఇటీవల ‘థాంక్యూ’లో కనిపించింది. కానీ ఇది పెద్దగా ఆకట్టుకోలేదు. ఇదంతా పక్కన పెడితే రాశీఖన్నా తాజాగా కొన్ని ఫొటోలను ఇన్ స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.
ఊహలు గుసగుసలాడే తర్వాత చాలా సినిమాల్లో నటించినా గుర్తింపు మాత్రం దక్కించుకోలేదు ఈ ఢిల్లీ చిన్నది. తెలుగుతో స్టార్ హీరోలతో కనిపించింది. అయినా అంతగా కలిసి రాలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలే కరువయ్యాయి.
రీసెంట్ గా రాశీఖన్నా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీటని చూసిన ఫాలోవర్స్, నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఇంత అందానికి అవకాశాలు రాకపోవడం బాధాకరం’ అని కొందరంటే.. ‘స్టార్ డం అర్హతలు ఉన్న నటి ప్రస్తుతం ఖాళీగా ఉంటుంది’. అని మరికొందరు కామెంట్ చేశారు.
ఇక ఆ మధ్య తన లవ్ స్టోరీ గురించి ఒక ఇంటర్వూలో మాట్లాడింది. గతంలో ఒక వ్యక్తిని ప్రేమించి మోసపోయానని అప్పటి నుంచి డీప్రెషన్ లోకి వెళ్లినట్లు చెప్తోంది. ఆ సమయంలోనే విపరీతంగా బరువు పెరిగానని, ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా తగ్గలేదని చెప్పింది.
ఆ తర్వాత కొంత కాలానికి మరో వ్యక్తి పరిచయం కావడంతో చాలా త్వరగా బరువు తగ్గానని చెప్పుకచ్చింది. ప్రస్తుతం తాము మంచి ఫ్రెండ్స్ అని కూడా చెప్పింది. అతను కెరీర్ పరంగా తనకు సపోర్టివ్ గా ఉంటాడని పేర్కొంది. ఈ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో?
రాశీఖన్నాకు ఏదీ కలిసిరావడం లేదు. వరుసగా అన్ని సినిమాల ఫ్లాప్స్ అవుతున్నాయి. మొన్న వచ్చిన ‘పక్కా కమర్షియల్’ కూడా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. దీంతో తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి. దీనికి కారణం ఆమె గతంలో ఎడా పెడా చేసిన సినిమాలే కారణమంటున్నారు ఫ్యాన్స్.
ప్రస్తుతం వరుసగా వెబ్ సిరీస్‌లో చేస్తోంది. ఇటీవల ఆమె నటించిన ‘ఫర్జి’ సిరీస్ విడుదలైంది.. రాశీ ఖన్నా 2013లో ‘మద్రాస్ కేఫ్’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో జాన్ అబ్రహంతో లిప్ లాక్ చేసింది. కానీ ఇది కూడా బక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఢిల్లీ బొమ్మ ఏ సినిమాలో అయితే లిప్ లాక్ చేస్తుందో ఆ సినిమా తుస్సు మంటుందని ట్రోల్ జరుగుతుంది.