R Narayana Murthy : చరణ్ సినిమాకు ‘నో’ చెప్పిన మూర్తన్న..ఎందుకంటే..

Ramcharan-Narayana Murthy

Ramcharan-Narayana Murthy

Ramcharan-Narayana Murthy : తెలుగు సినిమా యవనికపై ఆర్. నారాయణమూర్తిది ప్రత్యేక పంథా. నలభై ఏండ్లుగా సినిమా పరిశ్రమలో ఉంటున్నా.. ఏ రోజూ విలువలను కోల్పోలేదు. ప్రముఖ నటుడు అయినప్పటికీ ఇప్పటికీ సాధారణ వ్యక్తిలాగా ఆటోలో ప్రయాణించిడం, రోడ్ల పక్కన భోజనం చేయడం వంటివి చేస్తుంటారు. అంటే ఆయన ఆస్తులు లేకకాదు. కానీ ఆయన ఎప్పుడూ సాధారణ వ్యక్తిలాగా ఉండాలనే కోరుకుంటాడు. ఆయన మొదటి సినిమా నుంచి సమాజ శ్రేయస్సు కోరే సినిమాలు తీశారు తప్పా.. ఏ రోజు కమర్షియల్ హంగులకు పోలేదు. తన రూట్ మార్చుకోలేదు.

నారాయణమూర్తి విప్లవ సినిమాలు ఓ దశలో తెలుగు సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేశాయనే చెప్పాలి. అర్దరాత్రి స్వాతంత్ర్యం, దండోరా, ఎర్రసైన్యం, చీమలదండు’’ లాంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. కానీ ఆ తర్వాత వరుసగా పలు సినిమాలు ఫెయిలై ఆర్థికంగా నష్టాలు వచ్చిన తన విప్లవ పంథాను నారాయణమూర్తి వదులుకోలేదు. ఈక్రమంలో తన వైఖరినీ మార్చుకోలేదు. ఇప్పటికీ సామాజిక స్పృహ ఉన్న చిత్రాలను రూపొందిస్తున్నారు. ఈక్రమంలో ఆయన గతంలో ఎన్టీఆర్ ‘టెంపర్’లో ఓ ముఖ్య పాత్ర కోసం చాన్స్ వచ్చినా ఒప్పుకోలేదు.

తాజాగా రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఓ పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఓ కీలక పాత్రకు నారాయణమూర్తి అయితే బాగుంటుందని మూవీ టీమ్ భావించింది. చరణ్ సినిమా.. నారాయణమూర్తి ఎందుకు కాదనకుండా చేస్తాడు కావొచ్చు అని అంతా అనుకున్నారు. కానీ ఆయన దగ్గరికి వెళ్లి అడిగితే సున్నితంగా ‘సారీ చేయలేను’ అని చెప్పాడట.  ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సినిమాలో నటించాడని ఒప్పుకోలేదట. దీంతో మేకర్స్ మరో నటుడి కోసం అన్వేషిస్తున్నారని సమాచారం. ఈ మూవీ స్పోర్ట్స్ డ్రామాతో వస్తున్న విషయం తెలిసిందే.  పాన్ ఇండియా లెవల్లో వస్తుండడంతో వివిధ భాషల్లోని అగ్రనటులను ఈ సినిమాలో నటించనున్నారు. ఇప్పటికే హీరోయిన్ గా జాన్వి కపూర్, ఓ ప్రధాన పాత్రలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ను తీసుకున్నారు. మరికొందరు ప్రముఖ నటులు కూడా ఇందులో నటించనున్నారు.

TAGS