JAISW News Telugu

Kothakota : మోకాళ్ల నొప్పుల మందు కోసం.. కొత్తకోటలో జనాల క్యూ

Knee Pain Medicine

Knee Pain Medicine – Kothakota

Kothakota : వనపర్తి జిల్లా కొత్తకోటలో మోకాళ్ల నొప్పి తగ్గించే మందు బాగా పనిచేస్తుందని ప్రచారం జరగడంతో ప్రజలు ఎగబడ్డారు.  హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి మూడు రోజుల కింద కొత్తకోట బస్టాండ్ సమీపంలో ఉండే నాటు వైద్యుడు రాములు ఇస్తున్న ఆయుర్వేద మందు బాగా పని చేస్తోందని, తన మోకాళ్ల నొప్పి తగ్గిందని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.  అది వైరల్ కావడంతో ఒక్కసారిగా జనం తాకిడి పెరిగింది.

రెండు రోజుల నుంచి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తుండడంతో కొత్తకోట బస్టాండ్ కిక్కిరిసిపోతోంది. విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం రాములు దగ్గరకు వెళ్లి మాట్లాడారు. తాను వనమూలికల నుంచి తయారు చేసిన మందులనే ఇస్తున్నానని చెప్పాడు. ఆ మందు వల్ల దుష్ప్రభావాలు లేవని తేలేదాకా మందుల పంపిణీ ఆపెయ్యాలని సూచించారు. దీంతో అప్పటికప్పుడు మందుల పంపిణీ నిలిపివేస్తున్నట్టు బోర్డు పెట్టారు. మందుల పంపిణీ నిలిపివేశారని తెలియని వారు తరలి వస్తుండడంతో మంగళవారం కూడా కొత్తకోట రద్దీగా మారింది. ట్రాఫిక్ పోలీసులు రాములు దగ్గరకు వెళ్లి సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తి వివరాలు అడగ్గా తనకు తెలియదని తెలిపాడు. మందుల పంపిణీ ఆపేసినా రూ.1500కు ఒక టోకెన్ చొప్పున మంగళవారం ఒక్కరోజే 500కు పైగా టోకెన్లు ఇచ్చినట్టు సమాచారం.

Exit mobile version