Pawan Kalyan : కేబీసీలో అమితాబ్ నోట పవన్ కళ్యాణ్ పై ప్రశ్న.. కంటెస్టెంట్ ఎన్ని లక్షలు గెలుచుకున్నారో తెలుసా ?
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి దాదాపు పదేళ్ల పోరాటం తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యేతో పాటు డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టి పాలకుడిగా తనదైన మార్క్ చూపిస్తున్నారు. పవన్ తన రాజకీయ జీవితంలో అత్యంత కీలక దశలో ఉన్నాడు. ప్రజల్లో ఉంటూ ఓర్పుతో పోరాడితే ఎప్పటికైనా విజయం సాధించవచ్చని పవన్ కళ్యాణ్ నిరూపించారు. ఆయన బాటలో నడవడానికి పలువురు స్టార్లు సిద్ధమవుతున్నారు. పవన్ విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నోటి నుండి జనసేన ప్రస్తావన వచ్చింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్న పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. వారాహి యాత్ర, జనవాణి కార్యక్రమాలతో ప్రజలలో పాపులర్ అయ్యారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబును వైఎస్ జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేయడంతో తెలుగుదేశం అధినేత ను రాజమండ్రి సెంట్రల్ జైలులో పరామర్శించారు. జైలు నుంచి బయటకు రాగానే టీడీపీతో కలిసి జనసేన పనిచేస్తుందని ప్రకటించారు.
చంద్రబాబు విడుదల తర్వాత పొత్తు చర్చలు, ఉమ్మడి కార్యాచరణపై చర్చ జరిగింది. 50 నుంచి 60 సీట్లు ఇవ్వకుంటే పొత్తు వద్దని పెద్దలు హెచ్చరించినా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. బీజేపీని కూటమిలోకి తీసుకొచ్చేందుకు పవన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పలుమార్లు ఢిల్లీ వెళ్లి కమలం పార్టీ నేతలను ప్రసన్నం చేసుకుని కూటమి ఏర్పాటుకు ప్రయత్నించారు. ఒకానొక దశలో బీజేపీ అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు పవన్ చివరికి తనకు వచ్చిన సీట్లను కూడా త్యాగం చేశాడు. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. తన అభిమానులు, కాపు సామాజికవర్గం ఓట్లను గంపగుత్తగా కూటమికి తరలించడంలో పవన్ సక్సెస్ అయ్యారు. ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా జనసేన పోటీ చేసిన 21 స్థానాలకు గాను 21 సీట్లు గెలుచుకుని అరుదైన ఘనత సాధించారు. చంద్రబాబు కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా, ఆరు కీలక శాఖల మంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు.
టగ్ ఆఫ్ వార్ మధ్య తిరిగి ఎన్డీయే అధికారంలోకి రావడంలో పవన్ ప్రయత్నాలను గ్రహించిన మోడీ ఆయనను తుఫానుగా అని కొనియాడారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఎవరెస్ట్ స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి షో గురించి పవన్ ను అడిగారు. ఒక వృద్ధ దంపతులు హాట్ సీట్‌పై కూర్చొని ఉండగా, జూన్ 2024లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం అయిన అగ్రనేత ఎవరు అని వారికి ప్రశ్న వేశారు అమితాబ్.
ఎ.పవన్ కళ్యాణ్ బి.చిరంజీవి, సి.నాగార్జున, డి.నందమూరి బాలకృష్ణ పేర్లు ఆప్షన్లుగా తెరపైకి వస్తున్నాయి. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఈ జంట ఆడియన్స్ పోల్‌ను ఎంచుకుంటే 50 శాతానికి పైగా ఓట్లు పవన్ పేరుకు వచ్చాయి. దీంతో ఈ జంట పవన్ పేరును సెలక్ట్ చేసుకుంటుంది. దీనికి అమితాబ్ సరైన సమాధానం చెబుతూ మీరు రూ.1.60 లక్షలు గెలుచుకున్నారని ప్రకటించారు. అలాగే పవన్ కళ్యాణ్ గురించి అమితాబ్ వివరిస్తూ.. ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడని, ప్రముఖ నటుడు చిరంజీవి సోదరుడని చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Which Actor took charge as the Deputy CM Of Andhra Pradesh in June 2024 ?? 🔥💥
You know the answer??@PawanKalyan #TheyCallHimOG#KBC
pic.twitter.com/FBgQ2FpFIq— Narendra G (@Narendra4News) September 13, 2024