Sonia Nabeel : బిగ్ బాస్ సీజన్ 8 అనగానే గొడవలు, కొట్లాటలు ఎక్కువగా జరుగుతున్నాయి. బిగ్ బాస్ 4, బిగ్ బాస్ 5 చూడగానే అందరూ రొమాంటిక్, ఎనర్జిటిక్ ఎపిసోడ్ లు గుర్తు చేసుకుంటారు. అఖిల్ మోనాల్, అభిజిత్ మోనాల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, కంటెంట్ ఉన్న ఎపిసోడ్ లతో ఆద్యంతం ఆసక్తి కలిగించేలా ఉండేది. అభిజిత్ వేసిన ఎత్తకు బిగ్ బాస్ లో ఉన్న వారందరూ చిత్తు అవుతారు. నాగార్జున సైతం ఇంప్రెస్ అవుతారు.
కానీ బిగ్ బాస్ సీజన్ 8 లో ఒకే బకటి నడుస్తోంది. సోనియా ఏదీ చెబితే అది చేసేందుకు నిఖిల్, పృథ్వీరాజ్ వెనకాడటం లేదు. నిఖిల్ పూర్తిగా సోనియా మాయలో పడిపోయాడు. క్లాన్ లో పని చేసేందుకు ఏ మాత్రం ప్రయత్నించడం లేదు. సోనియాకు అసిస్టెంట్ గా చేస్తున్నాడని మిగతా కంటెస్టెంట్ లతో పాటు ఆడియన్స్ కూడా అనుకుంటున్నారు. గత వారం చీఫ్ గా చాలా బాగా పనిచేసిన నిఖిల్ ఈ వారం మాత్రం ఫెయిల్ అవుతున్నాడు.
గత వారం నాగార్జున సైతం నిఖిల్ ను మెచ్చుకున్నాడు. కానీ ఈ సారి మాత్రం కెప్టెన్ గా ఫెయిల్ అవుతున్నాడు. దీన్ని అందరూ తెలుసుకుంటున్నారు. కానీ నిఖిల్ కు మాత్రం అర్థం కావడం లేదు. నిఖిల్ క్లాన్ లో ఉన్న నైనిక, సీత కూడా నిఖిల్ ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. యాష్మీ మాత్రం ఆ పృథ్వీ ఏంటీ సోనియా ఏదీ చెబితే అది చేస్తూ కొట్టడానికి కూడా వెనకాడటం లేదు అని వాపోయింది.
పృథ్వీ రాజ్ ను పంపిస్తోంది సోనియాకు వచ్చే దమ్ము లేదా అంటూ ప్రేరణకు చెప్పి ఏడుస్తుంది. కాగా సోనియాతో నబీల్ గట్టిగా అరిచినందుకు అతడి మీదకు కొట్టేందుకు పృథ్వీ వచ్చేశాడు. ఇంతలా ఇద్దరు మగాళ్లను తన మాటలతో కట్టిపడేసింది సోనియా. ఇలా చేయడం కరెక్టేనా అంటే ఆమె తన గేమ్ ఆడుతోంది. కానీ వీరిద్దరికే అర్థం కావడం లేదని ప్రేక్షకులు అనుకుంటున్నారు.