Anasuya : అనసూయ భరద్వాజ్ గురించి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కూడా పరిచయం అవసరం లేదు కదా.. ఆమె చాలా రంగాలను టచ్ చేసింది. మొదట జర్నలిస్ట్ గా వచ్చిన ఆమె ఆ తర్వాత యాంకర్ గా మారింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్, లీడ్ రోల్స్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. రాను రాను తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ గ్లామరస్ పర్సనాలిటీస్ లో ఒకరిగా మారిపోయింది.
అప్పట్లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో నెక్ టు నెట్ ఫైట్ కు దిగింది. చాలా ట్రోల్స్ ఎదుర్కొన్న తర్వాత విరమిస్తున్నట్లు ప్రకటించింది. ఇదంతా పక్కన పెడితే డైరెక్టర్ సుకుమార్ కు అనసూయ అంటే మంచి ఒపీనియన్ ఉందట అందుకే ఆయన సినిమాల్లో మంచి మంచి రోల్స్ ఇస్తుంటాడు. రంగస్థలంలో రంగమ్మత్తగా చూపించిన సుకుమార్ తర్వాత పుష్పలో సునీల్ భార్యగా చూపెట్టారు. పుష్పలో మంచి రోల్ ఉన్న పాత్రలనే ఇచ్చాడు.
బోల్డ్ యాటిట్యూడ్ అప్పుడప్పుడు వివాదాల్లో ఇరుకున్నప్పటికీ ఆమెకు మేల్ ఫాలోయింగ్ ఎక్కువనే చెప్పాలి. సోషల్ మీడియాలో కూడా విశేషమైన ఉనికి ఉంది. అంత పాపులారిటీ ఉన్నప్పటికీ అనసూయ ఈ మధ్య కొత్త సినిమాలకు సైన్ చేయడంలో నెమ్మదించింది. ఇటీవల కొన్ని ఫ్లాపుల తర్వాత క్వాంటిటీ కంటే క్వాలిటీపైనే దృష్టి పెట్టాలని, మరింత సెలెక్టివ్, వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
పుష్ప 2 విడుదల తర్వాత తన కెరీర్ కు పెద్ద ఊపు వస్తుందని అనసూయ బలంగా భావిస్తోంది. ఇందులో తన పాత్ర మొదటి భాగం కంటే నిడివి, మరింత ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నారు. వైవిధ్యభరితమైన, అర్థవంతమైన పాత్రలను అందించే ప్రాజెక్టులను ఎంచుకుంటూ ముందుకు సాగాలని ఆమె కృతనిశ్చయంతో ఉంది.