PVR Multispeciality Hospital : విజయవాడలో మరో ప్రతిష్టాత్మక ఆస్పత్రి ప్రజలకు సేవలందించడానికి రెడీ అయ్యింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య చేతుల మీదుగా పివిఆర్ మల్టీస్పెషల్టి హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు హాజరై ప్రారంభించారు.
ఈ సభాకార్యక్రమానికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణం అధ్యక్షత వహించగా.. విశిష్ట అతిథులుగా మాజీ మంత్రివర్యులు కామినేని శ్రీనివాస్ , తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, తానామాజీ అధ్యక్షులు కోమటి జయరాం, రామినేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్ , పివిఆర్ హాస్పిటల్ ఎండి వెంకట రామయ్య , డాక్టర్ పాతూరి వెంకటరామ్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు