PV Sindhu : పి.వి. సింధు పెళ్లి చేసుకుంటుంది

PV Sindhu

PV Sindhu

PV Sindhu : బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పెళ్లికి సిద్ధమైంది. సింధూ బ్యాడ్మింటన్ క్రీడారంగంలో విజయాలు సాధించి ఏళ్ల తరబడి అవార్డులు, ప్రశంసలు అందుకుంది. చాలా రోజులుగా బ్యాచ్ లర్ లైఫ్ తో ఉన్న సింధు ఎట్టకేలకు పెళ్లికి సిద్ధమైంది. ఈ మేరకు ఆమె తండ్రి రమణ ప్రకటించారు. పి.వి. సింధు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, పోసిడెక్స్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట దత్తా సాయిని వివాహం చేసుకోబోతోంది. డిసెంబర్ 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ కోటలో సింధు-వెంకట దత్తా సాయి వివాహం జరగనుందని సింధు తండ్రి ప్రకటించారు.

ఈ నెల 20న వివాహ వేడుకలు ప్రారంభం కానుండగా, సింధు, వెంకట దత్త సాయి కుటుంబీకులు డిసెంబర్ 19న ఉదయ్‌పూర్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పి.వి. పెళ్లి తర్వాత కూడా తన కెరీర్‌ను కొనసాగిస్తుంది. పెళ్లి ముగియగానే వచ్చే సీజన్‌కు పీవీ సింధు సిద్ధమవుతుందని ఆమె తండ్రి తెలిపారు.

TAGS