JAISW News Telugu

KTR : ఇన్వర్టర్, ఛార్జింగ్ బల్బులను స్టాక్ పెట్టుకోండి: కేటీఆర్

FacebookXLinkedinWhatsapp
KTR

KTR

KTR : అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురకలు అంటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమని, బీఆర్ఎస్ కాదని ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రస్తుత కాలంలో ప్రజలు కొన్ని వస్తువులను స్టాక్ ఉంచుకోవాలని కోరారు. వాటిల్లో 1.ఇన్వర్టర్. 2.ఛార్జింగ్ బల్బులు. 3.టార్చ్ లైట్లు. 4.కొవ్వొత్తులు. 5.జనరేటర్లు. 6.పవర్ బ్యాంకులను స్టాక్ ఉంచుకోవాలని కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు.

వీటినే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలుగా హామీ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీల హామీ ఇచ్చి, ఈ వస్తువులను స్టాక్ పెట్టుకోవలసిన పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిందని అన్నారు. అందుకే మే 13 లోక్ సభ ఎన్నికల పోలింగ్ రోజు తెలివిగా ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ ప్రజలను కోరారు.

కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ‘‘ప్రధాని మోదీజీ.. ఆదానీ, అంబానీ స్కాంగ్రెస్ (కాంగ్రెస్) కు టెంపోల నిండా డబ్బు పంపిస్తుంటే.. ఆయన అభిమాన మిత్రులైన ఈడీ, ఐటీ, సీబీఐ ఎందుకు మౌనంగా ఉన్నాయి..? డీమోనిటైజేషన్ వైఫల్యం అని కూడా ఆయన ఒప్పుకుంటారా..? అని కామెంట్లు చేశారు.

Exit mobile version