Pushpa Count Down : పుష్ప సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అటు హీరో బన్నీని, ఇటు డైరెక్టర్ సుకుమార్ కు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక పార్ట్-2 పై క్యూరియాసిటి మరింత పెరిగింది. కానీ సినిమా వాయిదా పడుతుండడంతో అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు. గత నాలుగు నెలలుగా సినిమాపై ఎన్నో రూమర్లు వస్తూనే ఉన్నాయి.
అల్లు అర్జున్, సుకుమార్ మధ్య క్రియేటివ్ ఢిపరెన్సెస్ వచ్చాయని, అందకే సినిమా వాయిదా పడిందని సోషల్ మీడియాలో రూమర్లు వచ్చాయి. తీసిన సీన్లు నచ్చకపోవడంతో డైరెక్టర్ సుకుమార్ మళ్లీ రీషూట్ కు వెళ్తున్నాడని కూడా గాసిప్స్ వచ్చాయి. షూటింగ్ లేటవుతుండడంతో విలన్ ఫాహద్ ఫజిల్ కూడా సినిమా నుంచి తప్పుకుంటున్నాడని కూడా విపరీతంగా రూమర్లు వచ్చాయి. అయితే మేకర్స్ మాత్రం వీటిపై స్పందించలేదు.
ఇటీవల అల్లు అర్జున్, సుకుమార్ మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి అందరికీ షాకిచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 6న సినిమా విడుదలవుతుందటూ స్పష్టం చేశారు. మరోసారి ఈ సినిమా నుంచి పోస్టర్ తో అప్ డేట్ ఇచ్చారు. 75 డేస్ కౌంట్ డౌన్ వేస్తూ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంబుర పడిపోతున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేదేలేదంటున్నారు.