Pushpa : ఒక్క సినిమా అల్లు అర్జున్ సినిమా కెరీర్ గ్రాఫ్ నే మార్చింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. గతంలో టాలీవుడ్ తో సమాంతరంగా మాలీవుడ్ లోనూ బన్నీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. కేరళలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ హీరో బన్నీ కావడం విశేషం. ఇక్కడ యావరేజ్ గా ఆడిన సినిమాలు మలయాళంలో సూపర్ హిట్లుగా నిలిచాయి. కరుణాకరన్ దర్శకత్వంలో బన్నీ చేసిన హ్యాపీ సినిమా తెలుగులో ప్లాప్ కాగా, మలయాళంలో సూపర్ హిట్టయ్యింది. అలాగే తొలి ఆట నుంచే డిజాస్టర్ టాక్ మూటగట్టుకున్న వరుడు సినిమా మలయాళంలో మాత్రం విజయం సాధించింది.
ఇక పుష్ప సినిమాతో హిందీ బెల్టులోనూ చోటు సంపాదించుకున్నాడు బన్నీ. బాహుబలి-2 తర్వాత బాలీవుడ్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పుష్ప-2. ఈసినిమా థియేట్రికల్ హక్కుల కోసం బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు భారీగా ఆపర్ చేశారు. దాదాపు ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 900 కోట్లని బాలీవుడ్ టాక్.
ఇక పార్ట్-2 కు సంబంధించి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా రెమ్యూనరేషన్ గా బన్నీ లాభాల్లో వాటా తీసుకుంటున్నట్లు టాక్. ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలతో పోల్చుకుంటే బన్నీకి దాదాపు 300 కోట్ల రెమ్యూనరేషన్ ను నిర్మాతలు ముట్టజెప్పారని టాక్ వినిపిస్తుంది. కల్కి సినిమాకు ప్రభాస్ దాదాపు రూ.150 కోట్ల వరకు తీసుకున్నాడని, అల్లు అర్జున్ ఒక్క పాన్ ఇండియా సినిమాతోనే రెబల్ స్టార్ ను అధిగమించాడని చర్చ ఫలిలిం ఇండస్ట్రీలో జోరుగా సాగుతున్నది.