Pushpa 2 : అప్పుడు భయపెట్టిన పుష్ప.. ఇప్పుడు భయపడుతున్నాడా?
Pushpa 2 : టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ ది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పుష్ప-1 సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పార్ట్-2 కూడా సెట్స్ మీద ఉన్నది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రిలీజైన ఈ సినిమా ఘన విజయం సాధించింది.
బాలీవుడ్లో ఏమాత్రం అంచనాల్లేకుండా బరిలో నిలిచిన ఈ సినిమా ఉత్తరాది ప్రేక్షకులను సైతం ఊపేసింది. ఇక సమంత చేసిన ఐటెమ్ సాంగ్ ఈ సినిమాకు హైలెట్. ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్టే. ఇక ఇందులో అల్లు అర్జున్ మేనరిజమ్స్ యూట్యూబ్, ఇన్ స్టా లో ట్రెండింగ్ లో నిలిచాయి. .
పుష్ప-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ ఏడాది ఆగస్ట్ 15న పుష్ప-2 సినిమా విడుదల చేస్తామంటూ 200 రోజుల క్రితమే ప్రకటించారు. ఆ మేరకు పోస్టర్లు రిలీజ్ చేశారు. పాటలు, పోస్టర్లతో సినిమాపై హైప్ పెంచారు. పుష్ప-2 దెబ్బకు ఆగస్టు15న రిలీజ్ కావాల్సిన బాలీవుడ్ హీరోల సినిమాలను వాయిదా వేసుకున్నారు. అంత హైప్ క్రియేట్ చేసిన పుష్ప-2 ఇప్పుడు డిసెంబర్ 6 కు వాయిదా పడింది.
మెగా అభిమానమే భయపెడుతున్నదా?
మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ కాబోతున్నదని అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబురపడిపోతున్న సమయంలో పుష్ప-2 వాయిదా పడడం అందరినీ విస్తుపోయేలా చేసింది. అయితే దీనికి కారణం అల్లు అర్జున్ వైఖరేనంటూ సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అవుతున్నది. అయితే మొన్న ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారంచేయడం ఇందుకు కారణమని తెలుస్తున్నది. పవన్ కల్యాన్, మెగాస్టార్ చిరంజీవిని అవమానించిన జగన్ పార్టీకి అనుకూలంగా అల్లు అర్జున్ చేసిన ప్రచారంతో మెగా అభిమానులు విరుచుకుపడుతున్నారు. దీంతో సినిమా వాయిదా పడిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజులైతే అన్నీ సమసిపోతాయని భావించిన యూనిట్ సినిమా వాయిదా మేలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ పోస్ట్ పోన్ తో ఇందులో నటిస్తున్న ఓ హీరోపై ప్రభావం పడుతుండడంతో తాను ఈ సినిమా నుంచి తప్పుకుంటానని దర్శకుడితో ఖరాఖండిగా చెప్పాడట. దీంతో దర్శకుడు సుకుమార్ ఆందోళన చెందుతున్నాడట. దీంతో సుకుమార్ అల్లు అరవింద్ ను పురమాయించాడట. చిరంజీవిని కలిసి ఇష్యూ సమసిపోయేలా చేయమని చెప్పాడట. క్షమాగుణమున్న చిరంజీవి అన్నీ మరిచిపోతాడు. కానీ మెగా అభిమానులు జీర్ణించుకుంటారా లేదా అనేది ప్రశ్నగా మిగులుతున్నది.