JAISW News Telugu

Pushpa The Rule : ఉరకలు వేస్తున్న ‘పుష్ప : ది రూల్’ మూవీ టీం.. ఇప్పట్లో విడుదల అవ్వడం కష్టమే?

Pushpa The Rule : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘పుష్ప’ చిత్రం విడుదలై రెండేళ్లు పూర్తి అయ్యింది. రెండవ భాగం ‘పుష్ప: ది రూల్’ ని ఎట్టిపరిస్థితి లో 2022 డిసెంబర్ నాటికి విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ 2022 కూడా దాటిపోయి , 2024 వచ్చేసింది. సుకుమార్ ఈ కథ ని చెక్కేందుకే దాదాపుగా ఏడాదికి పైగా సమయం తీసుకున్నాడు. మొత్తానికి గత ఏడాదిలో షూటింగ్స్ సెట్స్ పైకి ఈ చిత్రాన్ని తీసుకొని రాగలిగారు.

ఆగష్టు 15 వ తారీఖున ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు గత ఏడాది అధికారిక ప్రకటన చేసారు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆగష్టు 15 వ తేదీన కూడా విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయట. ఎందుకంటే షూటింగ్ పార్ట్ చాలా వరకు బ్యాలన్స్ ఉందట. ఎంత వేగంగా పరిగెత్తినా ఆగష్టు 15 వ తారీఖున విడుదల అయ్యే పరిస్థితి కనిపించడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.

పుష్ప మొదటి భాగం కి కూడా ఇలాగే జరిగింది. చివరి నిమిషం వరకు పని చేస్తూనే ఉన్నారు. అలా పని చేస్తూ మొదటి కాపీ కూడా పూర్తి గా రెడీ అవ్వకముందే ఓవర్సీస్ కి ప్రింట్స్ ని పంపేశారు. అక్కడ చాలా సన్నివేశాలకు కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా లేక, గ్రీన్ మ్యాట్స్ కనిపించాయి. ఈసారి అలాంటి పొరపాటు జరగకూడదు అని సినిమా షూటింగ్ తో పాటుగా సమాంతరం గా వీఎఫ్ఎక్స్ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా చేస్తున్నారు. కానీ పని అవ్వడం లేదు. ఇప్పటి వరకు కేవలం 30 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి అయ్యింది. దానికి తోడు ఈ సినిమా కేశవ పాత్ర పోషించిన జగదీశ్ అరెస్ట్ అయ్యి ఈమధ్యనే బయటకి వచ్చాడు. మళ్ళీ ఆయన ఎప్పుడు రిమాండ్ లోకి వేళ్తాడో చెప్పలేని పరిస్థితి.

ఎందుకంటే ఈ సినిమా కేశవ పాత్ర చాలా కీలకం, పుష్ప పక్కనే సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ఉండే క్యారక్టర్ అది. ఇప్పుడు మళ్ళీ అతను రిమాండ్ లోకి వెళ్తే డేట్స్ మొత్తం వృధా అవుతాయి. అందుకే షూటింగ్ ని పూర్తి చేసేందుకు రెండు మూడు యూనిట్స్ తో పరుగులు తీస్తుంది మూవీ టీం. ఎట్టిపరిస్థితిలో ఈ చిత్రాన్ని ఆగష్టు 15 వ తేదీన విడుదల చెయ్యడానికే సన్నాహాలు చేస్తున్నారు. మరి విడుదల అవుతుందో లేదో చూడాలి.

Exit mobile version