Pushpa climax : పుష్ప2 బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. బీజీఎం అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ చింపేశాడని అందరూ అతడిని ప్రశంసిస్తున్నారు. అయితే పుష్ప మూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 90 శాతం తానే చేశానని.. కీలకమైన క్లైమాక్స్ సహా 90శాతం తన ప్రతిభనేని తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సీఎస్ సంచలన కామెంట్స్ చేశారు. దేవీశ్రీ ప్రసాద్ కు దక్కే ప్రశంసలు తనకే రావాలని శామ్ సీఎస్ అభిప్రాయపడ్డారు. దీంతో ఇప్పుడు ఈ బీజీఎం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.