Pushpa 3: పుష్ప 1 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వ్యక్తి ఫహద్ ఫాసిల్. పార్టీ లేదా పుష్ప అంటూ పుష్ప 1 సినిమాను ఎండ్ చేశారు. పుష్ప 2 లో కీలక రోల్ పోషిస్తున్న ఫాసిల్ కొన్ని సరికొత్త విషయాలు వెల్లడించారు. పుష్ప సినిమా ను మొదట ఒక పోర్షన్ తోనే సరిపెట్టి ముగించడానికి డైరెక్టర్ సుకుమార్ ప్రయత్నం చేశారు. కానీ ఇంటర్వెల్ సీన్ కాస్త క్లైమాక్స్ సీన్ వరకు పొడిగించారు.
ఎర్రచందనం వెనుక ఉన్న స్టోరీని తీయాలంటే ఒక్క సినిమాతో కాదని దీని రెండు పార్టీలుగా తీయాలని సుకుమార్ తనతో చెప్పాడని ఫహద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అసలు దీనికోసం ఒక వెబ్ సిరీస్ ని తీయాలని ముందుగా సుకుమార్ అనుకున్నాడని దాన్ని నెట్ క్లిప్స్ లో రిలీజ్ చేయాలని అనుకున్న ప్లాన్ కాస్త సినిమా రూపంలో రెండు పార్టీలుగా తీశారని మూడో పార్ట్ కోసం కూడా తీసే అవకాశం ఉన్నట్టు సుకుమార్ తనతో అన్నాడన ఫహద్ చెప్పారు.
తనకు తెలుగు డైలాగ్స్ గుర్తుంచుకోవడానికి అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ ఎన్నో అవకాశాలు ఇచ్చారని ఎంతో నేర్పించారని అన్నారు. ఫాసిల్ ప్రస్తుతం మలయాళ పుంజు అనే సినిమా చేస్తున్నారు. ఆయన నటించిన అనేక సినిమాలు ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతున్నాయి.
ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల్లో అన్నింటిలో ఎక్కువగా ఫాసిల్ ఉండడంతో అతడిని నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ కూడా గుర్తు పడుతున్నారు. విక్రమ్ సినిమాలో కీలక రోల్ పోషించారు. మలయాళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫాసిల్ భార్య కూడా హీరోయిన్ కావడం గమనార్హం. ప్రస్తుతం ఇండియా లెవెల్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులలో ప్రముఖ నటుడిగా కొనసాగుతున్నాడు. కమలహాసన్ తరువాత అనేక కీలక రూల్స్ చేస్తున్న వ్యక్తిగా పహాడ్ ఫాసిల్ తన సత్తా నిరూపించుకుంటున్నాడు.