సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప ది రైజ్ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కరోనా సీజన్ లో సగం అక్యూపెన్సీలో కూడా పుష్ప సంచలన విజయం సాధించింది. కనవీవిని ఎరుగని విజయం సాధించడంతో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. బాహుబలి-2 తర్వాత మళ్లీ అంతలా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమా ఇదే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బాహుబలి-2 కోసం ప్రేక్షకులు ఎంతగా నిరీక్షించారో పుష్ప-2 కోసం అంతే ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం సౌత్ బెల్టులో కన్నా నార్త్ బెల్ట్ లోనే భారీ కలెక్షన్లు సాధించింది
రిలీజ్ కు ముందే 900 కోట్ల బిజినెస్
పుష్ప-2 థియేట్రికల్ రిలీజ్ కోసం బాలీవుడ్ డిస్ర్టిబ్యూషన్ సంస్థలు పోటీ పడ్డాయి. నిర్మాతలకు 650 కోట్లు థియేట్రికల్ హక్కుల కోసం చెల్లించాయి. ఇక ఓటీటీ హక్కుల కోసం 250 కోట్లకు పైగానే వచ్చినట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇటీవల డిసెంబర్ 6న విడుదల చేస్తామని అల్లు అర్జున్ ప్రకటించారు. నిర్మాతలు సైతం 75 డేస్ టు గో అని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ అనూహ్యంగా సినిమాను ఒక రోజు ముందుగానే రిలీజ్ చేస్తామని నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అంటే డిసెంబర్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.