Pushpa 2 promotions : 2021, డిసెంబర్ 17న పాన్ ఇండియా వైడ్ గా విడుదలై మొదట నెగెటివ్ టాక్ వచ్చినా.. క్రమ క్రమంగా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని నార్త్ లో మోత మోగించింది పుష్ప1: ది ఫైర్. ఆ సమయంలో, ఇంత భారీ ప్రమోషన్లు లేని సమయంలోనే నార్త్ అంతా పుష్ప వైపు చూసింది, తగ్గేదెలా అంటూ దూసుకెళ్లింది.
ఈ సారి నార్త్ నే టార్గెట్ చేసిన యూనిట్ ప్రమోషన్లు షురూ చేయనుంది. ‘వేర్ ఈజ్ పుష్ప’ టీజర్ క్లిప్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. విడుదల చేసిన కంటెంట్ అభిమానులను, ఇండస్ట్రీ వర్గాలను మెప్పించింది. ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ, రష్మిక మందన వంటి స్టార్ కాస్ట్ ఫస్ట్ పార్ట్ లో భాగమవగా అవే క్యారెక్టర్స్ సెకండ్ పార్ట్ లో దర్శనమివ్వనున్నాయి.
పుష్ప1లో ‘ఊ అంటావా మావా.. ఉఉ అంటావా మావా..’ పాట కోసం సమంతను స్పెషల్ సాంగ్ కు ఒప్పించిన పుష్ప బృందం. ఈసారి స్పెషల్ సాంగ్ ‘శ్రీలీల’తో ప్లాన్ చేశారు. 17న విడుదల కానున్న ట్రైలర్ పై అంచనాలు భారీ గా ఉన్నాయి. ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్ ముగించుకున్న పుష్ప2 , రికార్డు బిజినెస్ ను సొంతం చేసుకుంది. 1000 కోట్లకు పైబడి బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఇంతటి భారీ లక్ష్యం తో థియేటర్లలోకి వచ్చిన పుష్ప ప్రమోషన్స్ లో తగ్గుతుందా.
ఇటీవలే, ఫ్రీ ఫైర్, గోల్డ్ మెడల్, డార్క్ ఫాంటసీ, ఆస్ట్రల్ పైప్స్, కజారియా, దావత్, థమ్సప్, కళ్యాణ్ జ్యులర్స్, టీ.వీ.ఎస్, జె.కె.టైర్స్ వంటి బడా బడా బ్రాండ్స్ తో ప్రొమోషన్ కొలాబరేషన్ ప్రకటించారు. 17న పాట్నా వేదికగా పుష్ప-2 ట్రైలర్ ను విడుదల చేయనుండగా ఫాన్స్ కూడా బొమ్మ పక్కా హిట్ అంటూ సంబురపడుతున్నారు.
ఇప్పటికే విడుదలైన ‘పుష్ప పుష్ప పుష్ప.. పుష్పరాజ్, సూసేకి అగ్గి రవ్వ మాదిరి.. రెండు పాటలు సూపర్, డూపర్ హిట్ కావడంతో మిగిలిన పాటలు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు పుష్ప ఫాన్స్.
డిసెంబర్ 5న విడుదలకు సిద్ధం అవుతున్న పుష్పగాడి రూలింగ్ ఎలా ఉంటుందో చూసేందుకు టాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలు ఆసక్తితో ఉన్నారు. ఈ ట్రైలర్ విడుదలతో పుష్ప ప్రమోషన్స్ సినిమాను ఏ స్థాయికి తీసుకువెళ్తాయో, సుక్కు, పుష్పను ఎక్కడ కూర్చోబెడతారో అని ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్స్ పై చిత్ర బృందం ఆసక్తి చూపించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.