Pushpa 2 : పుష్ప అంచనాలు తలకిందులయ్యాయా?
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప పార్ట్ 2 కోసం దేశమంతా ఎదురు చూస్తున్నది. పుష్ప రిలీజ్ సమయంలో బాలీవుడ్ హీరోలు సైతం తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకున్నారు . ఇటీవల వచ్చని పాటలకు సైతం అదిరిపోయే రెస్పాన్స్ వస్తున్నది. సూసేటి అగ్గిరవ్వ సాంగ్ యూ ట్యూబ్ రికార్డులను షేక్ చేస్తున్నది.
ఇక పుష్ప కు తిరుగులేదను కున్న సమయంలో అనుకోని ఉపద్రవం మీద వచ్చి పడింది. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే డైరెక్టర్ సుకుమార్ తో పాటు నిర్మాతలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ పేరు సంపాదించాలని చూస్తే సీన్ రివర్స్ అయ్యింది. అయితే కంటెంట్ పరంగానో, లేక సెన్సార్ పరంగానో కాదు.. పొలిటికల్ డ్యామేజ్.
దీనికి కారణం అల్లు అర్జునే. మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో
వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతుగా ప్రచారం చేయడమేనని అంతా అంటున్నారు. మెగా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తే అల్లు అర్జున్ మాత్రం వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేయడం ఈ వివాదానికి దారి తీసనట్లు తెలుస్తున్నది. నంద్యాల వైసీసీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కి మద్దతు ప్రచారం చేశాడు అల్లు అర్జున్. ఇదే మెగా అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఇప్పుడు మెగా వర్సెస్ అల్లు అభిమానుల వార్ గా మారింది. పుష్ప -2పై మెగా అభిమానుల ప్రభావం కచ్చితంగా పడుతుందని దర్శకుకు సుకుమార్ భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ సినిమా గురించి మెగా అభిమానులు నెగిటివ్ కామెంట్స్ స్ర్పెడ్ చేస్తున్నారు. పుష్ప -2 మూవీ కోసం భారీగా ఖర్చు చేశారు నిర్మాతలు. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాను రిలీజ్ చేసినా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు చాలా ముఖ్యం. దీంతో నిర్మాతల్లో ఇప్పుడు కొత్త భయం మొదలైంది.
సినిమాకు నెగటివ్ టాక్ వస్తే పరిస్థితి తలకిందులయ్యే ప్రమాదం ఉందని భావించిన సినిమా యూనిట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో సుకుమార్ పొలిటికల్ వేడి తగ్గే వరకు సినిమా రిలీజ్ చేయొద్దని నిర్మాతలను కన్విన్స్ చేసినట్లు తెలిసింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఆగస్టు 15న విడుల చేయాలని అంతా సిద్ధం చేసుకున్నారు. బాలీవుడ్ లో కూడా ఆ మేరకు డిస్ర్టిబ్యూటర్లతో మాట్లాడుకున్నారు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల సినిమాను వాయిదా వేయక తప్పని పరిస్థితి. దీంతో ఈ వేడి తగ్గడానికి సమయం పడుతుంది కాబట్టి సినిమాన డిసెంబర్ కి వాయిదా వేసినట్టు రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. బన్నీ కెరీర్ తో పాటు నిర్మాతలను కాపాడడానికి సుకుమార్ ఇలా చేస్తున్నారనే చర్చ జరుగుతున్నది. సినిమా యూనిట్ నుంచి అధికారికంగా ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏం జరుగుతుందో చూడాల్సిందే.