Allu Arjun:అల్లు అర్జున్‌కు అస్వ‌స్థ‌త?.. `పుష్ప 2` షూటింగ్‌కు బ్రేక్‌!

Allu Arjun:టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌తో పాటు నార్త్ ఆడియ‌న్స్ అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న సినిమా `పుష్ప 2`. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్నారు. `పుష్ప‌` పాన్ ఇండియా వైడ్‌గా సంచ‌ల‌న విజ‌యాన్ని అందించ‌డ‌మే కాకుండా దాదాపు 70 ఏళ్ల విరామం త‌రువాత బ‌న్నీకి జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డుని తెచ్చి పెట్టింది. దీంతో తొలి పార్ట్ భారీ విజ‌యాన్ని ద‌క్కించుకున్న నేప‌థ్యంలో పార్ట్ 2పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ప్ర‌స్తుతం `పుష్ప 2` షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇప్ప‌టికే టీమ్ విడుద‌ల చేసిన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసి సినిమా ఎప్పుడు డెప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తుందా? అని ప్రేక్ష‌కుల‌తో పాటు అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తికాబోతోంది? ..ఎప్పుడు థియేట‌ర్ల‌లోకి రాబోతోంద‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌కు తాజాగా బ్రేక్ ప‌డిన‌ట్టుగా తెలుస్తోంది.

దీనికి కార‌ణం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని, ఆయ‌నకు ఎదురైన ఆరోగ్య స‌మ‌స్యేన‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌లే ఈ మూవీ తాజా షెడ్యూల్‌ని రామోజీ ఫిల్మ్ సిటీలో ద‌ర్శ‌కుడు సుకుమార్ ప్రారంభించారు. బ‌న్నీపై భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ని చిత్రీక‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఓ యాక్ష‌న్ సీక్వెన్స్ చిత్రీక‌రిస్తుండ‌గా బ‌న్నీకి వెన్ను నొప్పి మొద‌లైంద‌ని, దాని కార‌ణంగానే షూటింగ్‌ని అర్థాంత‌రంగా నిలిపి వేశార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం.

ఈ వార్త‌ల్లో ఉన్న నిజం ఎంత‌న్న‌ది తెలియాలంటే టీమ్ అధికారికంగా స్పందించాల్సిందే. ఇదిలా ఉంటే ఇటీవ‌ల అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న‌ల‌పై జాత‌ర నేప‌థ్యంలో ఓ పాట‌ని చిత్రీక‌రించార‌ట‌. ఈ పాట‌తో పాటు, జాత‌ర స‌న్ని వేశాలు సినిమాకు ప్ర‌ధాన హైలైట్స్‌గా నిల‌వ‌నున్నాయ‌ని తెలుస్తోంది. బ‌న్నీ కూడా ఈ స‌న్ని వేశాల గురించి `మంగ‌ళ‌వారం` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్ర‌త్యేకంగా వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

TAGS