Pushpa 2 : ‘పుష్ప 2: ది రూల్’ షూటింగ్ పూర్తి కావడానికి మొదట 7 నెలల సమయం ఉందని భావించిన దర్శకుడు సుకుమార్, నటుడు అల్లు అర్జున్, ఆ తర్వాత పలు సెలవులు తీసుకొని స్లోగా చిత్రీకరణ కొనసాగించాలని భావించారు. కానీ, ఇప్పుడు ఈ వ్యూహం ఆచరణ సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చారు.
చిత్రీకరణ సమయంలో ‘గుంటూరు కారం’ టీం అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఇది షెడ్యూల్స్ ను చాలా వారాల పాటు వాయిదా వేసేందుకు దారి తీసింది. హీరో మహేశ్ బాబు తల్లిదండ్రులు చనిపోవడం ఇంకా కొన్ని కారణాలతో షూటింగ్ చాలా రోజుల పాటు వాయిదా పడింది. ఒక దశలో ఈ మూవీ రిలీజ్ పూర్తిగా ఆగిపోతుందని ఇండస్ట్రీ మొత్తం అనుకుంది. ఇంత భారీగా పెట్టబడి పెట్టి ప్రాజెక్ట్ ను వదులుకోవడం ఇష్టం లేక రిలీజ్ డేట్ ముందే అనౌన్స్ చేశారు. దీంతో డెడ్ లైన్ దగ్గర పడుతుండడంతో సినిమాను సమర్థవంతంగా ప్రమోట్ చేయడంలో ఇబ్బందులు పడ్డారు దర్శకుడు, హీరో.
‘గుంటూరు కారం’ చిత్రీకరణ డిసెంబర్ చివరి వారం వరకు కొనసాగడంతో ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌పై దృష్టి పెట్టడం త్రివిక్రమ్ కు అతిపెద్ద సవాలుగా మారింది. కొంత సమయం ఇస్తే సెకండ్ ఆఫ్ సన్నివేశాలను రీషూట్ చేయాలని త్రివిక్రమ్ భావించి ఉంటే బాగుండేది. మేజర్ సినిమాల షూటింగ్స్ అనుకున్న తేదీకి రెండు, మూడు నెలల ముందే పూర్తి చేయడం మంచిది.
దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ ‘గుంటూరు కారం’ విడుదల తర్వాత ఈ విషయాన్ని గ్రహించారని సమాచారం. దీంతో మరో రెండు మూడు నెలలకు ప్రముఖ ఆర్టిస్టుల నుంచి డేట్స్ కోరింది నిర్మాణ బృందం.