JAISW News Telugu

Pushpa 2 : పుష్ఫ 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. కారణాలు తెలిస్తే షాకే?

FacebookXLinkedinWhatsapp
Pushpa 2

Pushpa 2

Pushpa 2 Pre Release Event : పాన్ ఇండియా మూవీ అల్లు అర్జున్ కెరీర్ లోనే జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును తెచ్చి పెట్టిన పుష్ఫకు సీక్వెల్ గా పుష్ఫ 2 తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఫిల్మ్ మేకర్స్ ప్రకటించారు. గతంలో డిసెంబర్ 6 అని ప్రకటించినా దీన్ని డిసెంబర్ 5కు రిలీజ్ చేస్తున్నట్లు ఈ మధ్యే ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలిపారు.

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఎలాగైనా సరే భారీ హిట్టు కొట్టాలని అల్లు అర్జున్, సుకుమార్ దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో సినిమా విడుదలకు ముందు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి మరింత హైప్ క్రియేట్ చేయడం తెలిసిన విషయమే.

పుష్ఫ 2 రిలీజ్ కు ముందు నవంబర్ 28 న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టాలని మేకర్స్ అనుకున్నారు. కానీ తెలంగాణలోని హైదరాబాద్ లో నవంబర్ 30 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంది. అంటే ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ మంది ఒక చోట గుమికూడడానికి వీలు లేదు. ఇలాంటి సందర్భంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం కుదరదు. దీంతో ఏపీలోని అమరావతిలో ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

దీని కోసం ఏపీ డిప్యూటీ సీఎం సాయం తీసుకోవాలని టీం అనుకుంటోందని దీని కోసం అల్లు అర్జున్ పవన్ కల్యాణ్ ని కలిసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ ఇద్దరూ ఎన్నికల సమయంలో జరిగిన సంఘటన వల్ల విడిపోయారు. పనవ్ కల్యాణ్ ఫ్యామిలీ మొత్తం జనసేన కు సపోర్టు చేస్తే.. కేవలం అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ  అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. దీంతో వీరి మధ్య మాటల్లేవు. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ సపోర్టు చేస్తాడా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version