Pushpa 2 : The Rule : పుష్ప2 అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయేలా ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఫుల్ డిమాండ్ ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే జియో వరల్డ్ డ్రైవ్‌లో రేటు ఎక్కువగా ఉంది. ఈ హిందీ 2D వెర్షన్ కు రూ. 3000 టిక్కెట్ ధర పెట్టారు. టికెట్ ధరల్లో ముంబై అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీలో పీవీఆర్ డైరెక్టర్స్ కట్ వద్ద ధరలు 2400 రూపాయలు. అదే సమయంలో కోల్‌కతాలోని ఐనాక్స్ క్వెస్ట్ మాల్ లో రూ. 1680కి టిక్కెట్‌లు డిమాండ్ ఉంది. బెంగళూరులోని న్యూఫాంగిల్డ్ మినిప్లెక్స్ లో ఎంజీ రోడ్ టిక్కెట్‌ల ధర రూ. 1400గా ఉంది. చాలా ఇతర నగరాల్లో హిందీ 2D వెర్షన్లకు డిమాండ్ బాగా ఉంది. బెంగుళూరులో మాత్రమే తెలుగు వెర్షన్ హిందీని మించిపోయింది. తెలుగు వెర్షన్‌కు టిక్కెట్‌ల ధర రూ. 1600గా ఉండగా.. సూపర్‌ప్లెక్స్ ఫోరమ్ మాల్, బెంగళూరులోని కనకపుర, ఐఎన్‌ఎక్స్‌లో రూ. 1300గా ఉంది. బెంగళూరులో పుష్ప2 అడ్వాన్స్ బుకింగ్ లతో ఏకంగా కోటి రూపాయల గ్రాస్ దాటేయడం విశేషం.