Puri Jagannadh : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పూరి జగన్నాథ్ అనే వ్యక్తి ఒక చరిత్ర. ఒకే మూసలో వెళ్తున్న తెలుగు కమర్షియల్ సినిమాని సరికొత్త పంధాలో తీసుకెళ్లిన దర్శకుడు ఆయన. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బద్రి’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన, హీరోయిజానికి సరికొత్త నిర్వచనం తెలిపాడు. ఈ సినిమా తర్వాత ఆయన చేసిన ప్రతీ చిత్రం లోను హీరోల పాత్రలు ఫ్యాన్స్/ ఆడియన్స్ కి పూనకాలు రప్పించే విధంగా ఉంటాయి.
అయితే ఆయన కెరీర్ ని రెండు భాగాలుగా విభజిస్తే, ఛార్మీ ఆయన జీవితం లోకి అడుగుపెట్టక ముందు, పెట్టిన తర్వాత అని చెప్పొచ్చు. అప్పటి వరకు రెండు హిట్లు, మూడు ఫ్లాపులు అన్నట్టుగా సాగిన పూరి జగన్నాథ్ కెరీర్, ఛార్మీ తో జతకట్టిన తర్వాత అసలు హిట్ అనే పదానికి స్పెల్లింగ్ కూడా మర్చిపోయాడు. జ్యోతి లక్ష్మి తర్వాత ఆయన దర్శకత్వం లో వచ్చిన సినిమాలలో కేవలం ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం ఒక్కటే సూపర్ హిట్ గా నిల్చింది.
ఆ తర్వాత మళ్ళీ ఆయన ‘లైగర్’ చిత్రం తో డిజాస్టర్ ఫ్లాప్ అందుకొని తన ఫ్లాప్ స్ట్రీక్ లోకి వచ్చేసాడు. ఇప్పుడు రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మీదనే ఆయన భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఛార్మీ తో కలిసి నిర్మాణ సంస్థని ప్రారంభించినప్పటి నుండి పూరి జగన్నాథ్ తన జీవితం లో ఆర్థికంగా మాత్రమే కాకుండా, మానసికంగా కూడా బాగా కృంగిపోయాడు. అప్పట్లో ఈయనకి ముమైత్ ఖాన్ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ గా ఉండేదట. వీళ్లిద్దరి పరిచయం 143 అనే చిత్రం ద్వారా జరిగింది. ఆ తర్వాత ‘పోకిరి’ సినిమాతో అది తారాస్థాయికి చేరింది. అప్పటి నుండి పూరి జగన్నాథ్ తన ప్రతీ సినిమాలో ముమైత్ ఖాన్ తో కచ్చితంగా ఒక ఐటెం సాంగ్ పెట్టిస్తూ వచ్చేవాడట.
అప్పట్లో హైదరాబాద్ కి వచ్చినప్పుడల్లా ముమైత్ ఖాన్ పూరి జగన్నాథ్ ఇంట్లోనే ఉండేదట. పూరి భార్య శ్రావణి స్వయంగా తన చేతులతో ముమైత్ ఖాన్ కి గోరు ముద్దలు తినిపించేదట. కానీ ఎప్పుడైతే ఛార్మీ వచ్చిందో అప్పటి నుండి ముమైత్ ఖాన్ ని దూరం పెట్టేసాడు. తన సినిమాల్లో అవకాశం ఇవ్వడం కూడా మానేసాడట. అలా ముమైత్ ఖాన్ టాలీవుడ్ లో కనిపించకుండా పొయ్యింది అని అంటున్నారు.