TDP Viral Song : ‘‘పుణ్యభూమి నా ఆంధ్రా..’’ గూస్ బంప్స్ తెప్పిస్తున్న తెలుగుదేశం పాట

Punyabhoomi na Andhra – TDP Viral Song
TDP Viral Song : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం జనాల నాడీని బట్టి రాష్ట్రంలో టీడీపీ కూటమే అధికారంలోకి రాబోతోందనే అంచనాలు ఉన్నాయి. ఈ ప్రచారంతో ప్రజల్లో కూటమికి అనుకూలమైన వేవ్ కనపడుతోంది. ఐదేళ్లలో వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అలాగే ఉద్యోగ, ఉపాధి, రాజధాని విషయమై యువత జగన్ పార్టీపై కన్నెర్ర చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు సోషల్ మీడియా, యాడ్స్, పాటల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నాయి. వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసంపై, చంద్రబాబు పాలనలో జరిగిన మంచి పనులపై టీడీపీ కూటమి పాటల ద్వారా ఓటర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఎన్నో పాటలు జనాలను ఉర్రూతలూగిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాలను ప్రశ్నిస్తున్నాయి. జగన్ పాలనలో జరిగిన నష్టాలను సగటు ఓటరు కూడా అర్థమయ్యేలా పాటలు ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా చంద్రబాబు పాలనపై ఓ అద్భుత పాటను రిలీజ్ చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మూవీ ‘మేజర్ చంద్రకాంత్’ లోని ఎవర్ గ్రీన్ సాంగ్ ‘‘పుణ్యభూమి నా దేశం..’’ ట్యూన్ తో ‘‘పుణ్యభూమి నా ఆంధ్రా నమో నమామి..ధన్యభూమి నా ఆంధ్రా సదా స్మరామి’’ అనే పాట ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగిస్తోంది. ఆ పాట లాగే ఈ పాట కూడా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పాటను రాశారు. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టాన్ని ఈ పాట తెలియజేస్తోంది. ఎమోషనల్ గా సాగుతున్న పాట కన్నీళ్లను తెప్పిస్తోంది. చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు తేడాలను స్పష్టంగా వివరించింది ఈ పాట. ఈ పాట విన్న వారు కచ్చితంగా ఎమోషనల్ అవుతారని చెప్పవచ్చు.
కాగా, చంద్రబాబు దాదాపు 70 ఏండ్ల వయసులో కూడా చురుకుగా ప్రచారంలో పాల్గొంటుండడం టీడీపీ క్యాడర్ లో జోష్ ను పెంచుతోంది. కూటమి ప్రభుత్వం రావడం ఖాయమని, సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడం పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ కూటమి జనాల్లో సానుకూల స్పందన వస్తోంది. ఈసారి చంద్రబాబును సీఎంగా చేయాలని జనాలు ఫిక్స్ అయినట్టు కనపడుతోంది. ఆయన సీఎం అయితేనే గత ఐదేండ్లలో విధ్వంసమైన ఏపీని చక్కదిద్దగలరని వారు నమ్ముతున్నారు. కాగా, అద్భుతమైన ఈ పాటను మీరు కూడా విని ఆనందించండి మరి.