RR Vs PBKS : రాజస్థాన్ రాయల్స్ పై పంజాబ్ సూపర్ విక్టరీ..

RR Vs PBKS

RR Vs PBKS

RR Vs PBKS : రాజస్థాన్ రాయల్స్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. మొదట్లో 9 మ్యాచుల్లో ఎనిమిది గెలిచి టాప్ వన్ స్థానంలో ఉన్న రాజస్థాన్ వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోతోంది. ఇప్పటికే 16 పాయింట్లతో ప్లే ఆప్ చేరడంతో ఊపిరి పీల్చుకుంది. లేకపోతే ఈ టీం కూడా మిగతా జట్ల లాగే ప్లే ఆప్ రేసుకోసం తిప్పలు పడాల్సి వచ్చేది.

పంజాబ్ తన చివరి లీగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను మట్టికరిపించి గెలుపుతో ఇంటి బాట పట్టింది. పాయింట్స్ టేబుల్స్ లో చివర్లో ఉన్న పంజాబ్ రాజస్థాన్ పై గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. రాజస్థాన్ కెప్టెన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపాడు. కానీ యశస్వి జైశ్వాల్ పూర్ పామ్ తో  సతమతమవుతూనే ఉన్నాడు. కేవలం నాలుగు పరుగులకే ఔటయ్యాడు. సంజు కూడా 18 పరుగులు, మరో ఓపెనర్ కోలెన్ కడ్ మోర్ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ కావడంతో 42 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ సమయంలో అశ్విన్, రియాన్ పరాగ్ జోడి సమయోచిత బ్యాటింగ్ తో ఇన్సింగ్స్ ను చక్కదిద్దారు. 28 పరుగులు చేసిన అశ్విన్ 3 ఫోర్లు 1 సిక్సు బాదాడు. రియాన్ పరాగ్ ఆరు ఫోర్లతో 48 పరుగులు చేయగా.. మిడిల్ ఓవర్లలో బ్యాటర్లు చేతులెత్తేయడంతో 145 పరుగులకే ఇన్సింగ్స్ ను ముగించింది. పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్  రెండు వికెట్ల చొప్పున తీయగా..  మిగతా బౌలర్లు ఒక్కో వికెట్ తీశారు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ ప్రభు సిమ్రన్ 4 పరుగులకే ఔట్ కాగా.. 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ సామ్ కరన్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో వీరోచిత ఇన్సింగ్స్ ఆడి మ్యాచ్ ను గెలిపించాడు. చివరి వరకు క్రీజులో ఉన్న సామ్ కరన్ రాజస్థాన్ కు ఏ మాత్రం చాన్స్ ఇవ్వలేదు. జితేశ్ శర్మ 22, అశుతోష్ 17 పరుగులు చేయగా.. పంజాబ్ గెలుపుతో ఈ సీజన్ ను ముగించింది.

TAGS