Minister Anangani : గత ప్రభుత్వంలో 13.59 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో భూ కబ్జాలపై 8305 ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయన్నారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా శాసనమండలిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. భూ కబ్జాలు అరికట్టేందుకే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తున్నామని, భూకబ్జాలకు పాల్పడిన వారికి 10-14 ఏళ్లు శిక్ష పడేలా కొత్త చట్టం ఉంటుందన్నారు. మదనపల్లిలో 13 వేల ఎకరాలలో పేర్లు మార్చారని, 500 ఎకరాలపై అక్రమాలు నిర్ధారణ అయ్యాయని పేర్కొన్నారు. మదనపల్లి భూ అక్రమాల్లో అధికారులు, నేతలు ఎంతటి వారున్నా శిక్షిస్తామని మంత్రి అనగాని హెచ్చరించారు.