Pune Car Accident Case : పుణె కారు ప్రమాదంలో కొత్త ట్విస్ట్ బయటపడింది. కారు ప్రమాదంలో కేసులో మైనర్ రక్త నమూనాలను అతని తల్లితో మార్చుకున్నట్లు నిర్ధారించిన తర్వాత పుణె పోలీసులు యువకుడి తల్లిని సైతం అరెస్టు చేశారు. ఈ మేరకు నగర పోలీసు ఉన్నతాధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రమాదంపై దర్యాప్తులో యువకుడి రక్త నమూనాలను అతని తల్లికి మార్చినట్లు తేలిందని పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు.
ఈ కేసును విచారించిన కమిటీ నిందితుడి రక్త నమూనా తల్లి రక్త నమూనాను తీసుకున్నట్లు తేలింది. బ్లడ్ శాంపిల్ మార్చేందుకు నిందితుడి కుటుంబీకులు వైద్యులకు కేవలం రూ.3 లక్షలు మాత్రమే లంచం ఇచ్చినట్లు సమాచారం. బాలుడి రక్త నమూనాను తల్లి రక్త నమూనాలో మార్చేసి ఉండొచ్చని క్రైం బ్రాంచ్ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి, పోర్షే కారులో ప్రమాద సమయంలో నిందితుడు మద్యం తాగి ఉన్నాడని అతని స్నేహితులు శుక్రవారం పోలీసులకు తెలిపారు. ఇక, మద్యం మత్తులో రోడ్డుపై గంటకు 200 కి.మీ. వేగంతో కారు నడిపినట్లు వాళ్లు తెలిపారు.