Jagan Company : జగన్ సొంత కంపెనీ ఉద్యోగుల నిరసన.. ప్రధాన ద్వారం గేటు వద్ద నిల్చుని మరీ..

Jagan Company

Jagan Company

Jagan Company : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు రాక ముందు నుంచే అనేక వ్యాపారాలు చేస్తుండేవారు. గతంలో ఆయన చేసిన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన వారిపై  సీబీఐ కేసు నమోదు చేసింది. ఇప్పటికీ ఆ కేసుల కోసమే వైఎస్ జగన్ కోర్టులకు హాజరవుతూ ఉంటారు.

ఇటు పొలిటికల్ ను అటు బిజినెస్ ను సమాంతరంగా నడిపిస్తుంటారు వైఎస్ జగన్. ఆయనకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. అవన్నీ దాదాపు దేశంలో మంచి రేటింగ్ లో ఉన్నవే సాక్షి దినపత్రిక, సాక్షి న్యూస్ ఛానల్, భారతి సిమెంట్, తదితర బిజినెస్ లు ఉన్నాయి. ఇంకా ఇతర కంపెనీల్లో ఆయనకు వాటాలున్నాయి. ఆయనకు వాటా ఉన్న భారతీ సిమెంట్ కు సంబంధించి భూ బాధితులు, కార్మికులు, ఉద్యోగులు తమకు అన్యాయం జరిగిందంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్ కడప జిల్లా, కమలాపురం మండలం, నల్లింగైపల్లె గ్రామంలో భారతీ సిమెంట్ కంపెనీ ఉంది. ఈ సంస్థ ఆవరణలో ఉద్యోగులు గురువారం (మే 30) ఆందోళనకు దిగారు. సంస్థ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. పరిశ్రమ స్థాపనకు భూములు ఇచ్చిన వారికి ఐదేళ్ల పాటు ఏడాదికి రూ.10 వేలు ఇంక్రిమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంస్థకు భూములు ఇస్తే సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 2010లో భూ నిర్వాసితులకు రూ. 2లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని, దీనికి సంబంధించిన డబ్బును రూ. 2లక్షలకు వడ్డీగా సహా బాధితులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు భూములు అందజేసిన ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రతి మూడేళ్లకోసారి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

ప్రతి మూడేళ్లకోసారి డిగ్రీ హోల్డర్లు, ఐదేళ్లకోసారి ఐటీఐ హోల్డర్ల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని కంపెనీ ఇచ్చిన హామీని యాజమాన్యం నిలబెట్టుకోలేదని ఆరోపించారు. విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. సీఎం సొంత కంపెనీ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఎలా నిరసన తెలపాల్సి వచ్చిందో ఆశ్చర్యంగా ఉంది. 

TAGS