JC Prabhakar Reddy : పీఎస్ వద్ద నిరసన.. 150 వాహనాల్లో బయల్దేరిన జేసీ ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy
JC Prabhakar Reddy : మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం ఒకటో ఠాణా వద్ద నిరసన తెలియజేసేందుకు 150 వాహనాల్లో బయల్దేరారు. అక్కడ నిరసన తెలిపేందుకు సుమారు 150 వాహనాల్లో అనుచరులతో తరలివెళ్లారు. తమపై నమోదు చేసిన అక్రమ కేసులకు ఆధారాలు చూపించాలని ఈ సందర్భంగా జేసీ డిమాండ్ చేశారు.
పోలింగ్ రోజు జరిగిన అల్లర్లలో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారంటూ ఆయన నిరసన తెలియజేయనున్నారు. రాళ్ల దాడి కేసుల్లో పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. అనంతపురం ఒకటో పట్టణ పీఎస్ ఎదుట నిరసన అనంతరం జిల్లా ఎస్పీని జేసీ కలవనున్నారు.