Botsa Satyanarayana : మంత్రి బొత్స సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. విజయనగరంలోని గజపతినగరం హైవేపై ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని అంగ న్వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తమ సమస్య లను పరిష్కరించాలని వేతనాలు పెంచాలని మంత్రిని వారు డిమాండ్ చేశారు. శాంతియుతం గా సమ్మె చేస్తున్న మాపై ప్రభుత్వం ఎస్మా ప్రయో గించడాన్ని వారు తప్పు పట్టారు. వేతనాలు పెంపు మినహా ఇతర సమస్యలన్నీ పరిష్కరి స్తామని హామీ ఇచ్చి మంత్రి అక్కడి నుంచి జారుకున్నారు.
అంగన్వాడీల సమ్మె ఉధృతం కావడంతో ఎక్కడి కక్కడ ప్రజా ప్రతినిధులకు నిరసన సెగలు తగులు తూనే ఉన్నాయి. నేటితో ప్రభుత్వం పెట్టిన డేట్ లైన్ ముగిసిపో యింది. అయినప్పటికీ అంగన్వాడీ కార్యకర్తలు కొంతమంది విధులకు హాజరు కాలేదు తమ డిమాండ్లు పరిష్కరించేం తవరకు విధులకు హాజరు కామని తేల్చి చెప్తున్నా రు. ప్రభుత్వం భయపెట్టాలని చూస్తే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నా మని అంగన్వాడి కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.