Congress rally : విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి విజయవాడలో లాంతర్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు. గవర్నరుపేటలోని ఆంధ్రరత్న భవన్ నుంచొ చల్లపల్లి వరకు సాగిన ర్యాలీలో ఏఐసీసీ సంయుక్త కార్యదర్శి పలక్ వర్వ, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. విద్యుత్ చార్జీలను తగ్గించాలని, ప్రజలపై భారం మోపొద్దని నినాదాలు చేశారు. ఇందిరాగాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైసీపీ హయాంలో రూ.35 వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. వెంటనే ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.