YS Sharmila : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. సొంత అన్నపైనే చెల్లి షర్మిల తిరుగుబాటు ప్రకటించడం, అతడి పార్టీని గద్దె దించడం కోసం రాజకీయ యుద్ధం తలపెట్టడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అన్న జగన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్క కొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేధనకు గురవుతున్నారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన చెందుతోంది. అందుకే తనకు కాకపోయిన తన పిల్లలకు అయినా మేనమామలా ఇవ్వాలని ఆమె కోరుతోంది. అయితే జగన్ రెడ్డి మాత్రం ఎక్కడ ఆస్తి గురించి అడుగుతారోనని అల్లుడి పెళ్లికి కూడా వెళ్లలేదు. ఈ విషయం పక్కన పెడితే షర్మిల ఇలా రోడ్డున పడడం కంటే ఆస్తి కోసం కోర్టుకెళ్లి న్యాయపోరాటం చేయవచ్చు కదా అనే డౌట్ అందరికీ వస్తుంది..
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆస్తిలో మహిళలకు సమాన హక్కు చట్టం తెచ్చారు. ఆ చట్టం అమల్లో ఉంది. పిత్రార్జితంగా వచ్చిన ఆస్తిలో పిల్లలతో పాటు తల్లీకి వాటా ఉంటుంది. నిజానికి వైఎస్ సంపాదించిన ఆస్తులేమీ లేవు. ఆయన సీఎం అయ్యే ముందు కూడా హైదరాబాద్ లో ఉన్న ఇల్లును అమ్ముకోవాలనుకున్నారు. కానీ సీఎం పదవి వచ్చాక ఆయన దశ తిరిగిపోయింది. కానీ అదంతా అక్రమ సంపాదన. ప్రభుత్వ ఆస్తులను దోచి పెట్టి.. సొంత ఖాతాలకు డబ్బులను పెట్టుబడుల రూపంలో జమ చేయించుకున్నారు. పైగా ఇందులో సూట్ కేస్ కంపెనీల్లోనే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి.
జగన్ రెడ్డి నామినేషన్ తో పాటు ప్రకటించిన ఆస్తుల పత్రాలు చూస్తే..లోటస్ పాండ్ ఎవరిది..తాడేపల్లి ప్యాలెస్ ఎవరిది..యలహంక ప్యాలెస్ ఎవరిది..బెంగళూరు మంత్రి మాల్ ఎవరిది.. పులివెందుల..కడప సహా పలు నగరాల్లో ఉన్న ప్యాలెస్ లు ఎవరివి అనే డౌట్లు వస్తాయి. ఎందుకంటే అవేమీ జగన్ రెడ్డి పేరు మీద ఉండవు. సూట్ కేస్ కంపెనీల పేరుతో ఉంటాయి. వాటిని కోర్టుకెళ్లి జగన్ వే అని నిరూపించి న్యాయపోరాటం చేయలేరు. అందుకే షర్మిల అన్నను రాజకీయంగా దెబ్బతీసైనా తన పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నారు.