Paganism In Kanipakam : విఘ్నేశ్వరుడు వెలసిన క్షేత్రం కాణిపాకం. భక్తుల కోరికలు తీర్చేందుకు గణపతి దేవుడు అనుగ్రహిస్తాడని భక్తులు నమ్ముతుంటారు. గణపతి ఆలయంతో పాటు పరమేశ్వరుడి ఆలయం, వరదరాజ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. కాణిపాకం దేశంలోనే ప్రాధాన్యం కలిగిన క్షేత్రంగా విరాజిల్లుతోంది. అందుకే ఇక్కడకు భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు.
వరద రాజ స్వామి ఆలయం దీప స్తంభం వద్ద అన్యమతస్తుల ఫొటోను భక్తులు గుర్తించారు. విషయం తెలుసుకున్న స్థానికులు, భక్తులు అధికారులకు తెలియజేశారు. దీంతో ఈ సంఘటనపై విచారణకు ఆదేశించింది. అన్యమతస్తుల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. హిందూ మతం ఆరాధించే దేవాలయాల్లో అన్యమతస్తుల ప్రచారం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇంత జరుగుతున్నా దేవాదాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు. మన దేవుళ్ల పక్కన వారి దేవుళ్లను ఉంచడంలో వారి ఆంతర్యమేమిటి? వారి దేవాలయాల్లో మన దేవుళ్ల ఫొటోలు పెడితే ఊరుకుంటారా? మనపై చర్యలు తీసుకోరా? వారికో న్యాయం మనకో న్యాయమా? చట్టం పనిచేస్తుందా? అన్యాయం చేసే వారిపనై చర్యలు తీసుకోవడంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు.
గతంలో తిరుపతి లాంటి ప్రదేశాల్లో కూడా అన్యమత ప్రచారం జరిగింది. మన దేవాదాయ శాఖ వినోదం చూస్తోంది. దానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తుండటంతో వారికి భయం లేకుండా పోతోంది. ఎవరి నమ్మకం వారిది? ఎవరి దేవుళ్లు వారికి ఉన్నాయి. అంతమాత్రాన మన దేవాలయాల్లో వారి ప్రాబల్యం ఏమిటని అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.