IAS officer Hemanth : ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటిముందు నిర్మాణాలను కూల్చివేతకు ఆదేశాలిచ్చిన ఐఏఎస్ అధికారి హేమంత్ సహదేవరావు తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆయనను వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీగా నియమించింది. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని జగన్ ఇంటి ముందు అక్రమ కట్టడాల కూల్చివేతకు హేమంత్ ఆదేశాలిచ్చారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ఉన్న ఆయనపై ప్రభుత్వం వేటు వేసి, తాజాగా ప్రమోషన్ ఇచ్చింది.
తెలంగాణలో ఒకసారి 44 మంది కీలక అధికారుల బదిలీలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అందులో హైదరాబాద్ లోటస్ పాండ్ లోని జగన్ ఇంటి ముందు కట్టడాలు కూల్చడానికి ఆదేశాలిచ్చిన హేమంత్ సహదేవరావుకు కూడా ప్రమోషన్ ఇచ్చారు. పది రోజుల క్రితం బదిలీ చేసిన అధికారికి ప్రస్తుతం ప్రమోషన్ ఇవ్వడం, అది కూడా కీలక శాఖలో బాధ్యతలు అప్పగించడం అధికారిక వర్గాలలో చర్చనీయాంశమైంది.