JAISW News Telugu

Prof. Kodandaram : మంత్రిగా కోదండరామ్..మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..ఏశాఖ అంటే..

Prof. Kodandaram as Minister

Prof. Kodandaram as Minister

Prof. Kodandaram as Minister  : ప్రొఫెసర్ కోదండరామ్.. పొలిటికల్ జేఏసీ సారథిగా తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. 2009లో సోనియాగాంధీ తెలంగాణ ప్రకటన చేసి.. డిసెంబర్ 23న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత కేసీఆర్, జానారెడ్డి తదితరులు అందరూ కలిసి పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్ గా కోదండరామ్ ను ఎంపిక చేశారు. అప్పటికే తెలంగాణ ఉద్యమంలోనూ, తెలంగాణలో జరిగే ప్రతీ సమస్యపై పోరాడే వ్యక్తిగానూ ఆయన స్థానం వెలకట్టలేనిది. జయశంకర్ తర్వాత ఆ స్థాయి ఉద్యమకారుడిగా కోదండరామ్ పేరు చరిత్రలో లిఖితమైంది. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు నుంచి ఉద్యమంలో కేసీఆర్ కు పూర్తిగా సహకరిస్తూ వచ్చారు. అందరి తోడ్పాటుతో తెలంగాణ కల సాకారమైంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కేసీఆర్..  కోదండరామ్ ను పక్కకు పెట్టారు.

ఆ తర్వాత కోదండరామ్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే ప్రజావ్యతిరేక పనులపై ప్రశ్నించుకుంటూ వచ్చారు. ఈక్రమంలో కాంగ్రెస్ కు పూర్తి మద్దతు ఇచ్చుకుంటూ వచ్చారు. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి..కోదండరామ్ తో మంచి సాన్నిహిత్యం కుదుర్చుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్ సీఎం కావడంతో కోదండరామ్ ను ప్రభుత్వంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావించింది.

ఈనేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. అంతకుముందే నామినేటేడ్ పదవులతో పాటు మంత్రివర్గాన్ని కూడా విస్తరించాలని భావిస్తున్నారు. తన కేబినెట్ లోకి కోదండరామ్ ను తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. దీనిపై హైకమాండ్ తుది ఆమోదం తెలుపాల్సి ఉంది.

రేవంత్ రెడ్డి పాలనలోనూ, పార్టీ డెవలప్ మెంట్ లోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీకి తన తెలంగాణ జన సమితి ద్వారా, వ్యక్తిగతంగా కోదండరామ్ అందించిన సహకారానికి మంత్రిగా అవకాశం ఇవ్వాలని రేవంత్ ఆలోచిస్తున్నారు. మంత్రివర్గంలో మరో స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అందులో హోం, విద్యా, సాంఘిక సంక్షేమం, మున్సిపల్ వంటివి ఉన్నాయి. వీటిలో కోదండరామ్ కు విద్యా శాఖ మంత్రి పదవి అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయి. రిటైర్డ్ ప్రొఫెసర్ గా కోదండరామ్ విద్యాశాఖపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి నడిచిన అనుభవం ఉంది.  అలాగే టీఎస్సీపీఎస్సీ వివిధ రిక్రూట్ మెంట్ బోర్డులను పారదర్శకంగా నడిపించడానికి ఆయన అనుభవం పనికివస్తుంది. అలాగే కోదండరామ్ కు పదవి ఇవ్వడం ద్వారా నైతికంగా కేసీఆర్ పై విజయం సాధించినట్టు అవుతుంది. ఉద్యమకారులను కేసీఆర్ అవమానిస్తే.. తాను ఉన్నత పదవులు ఇస్తున్నానని చెప్పడానికి అవకాశం ఉంటుంది.

అన్నీ సకాలంలో కుదిరితే ఈ నెలాఖరులోనే మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే టీఎస్సీపీఎస్సీ బోర్డుకు కొత్త చైర్మన్, సభ్యులను కూడా ఈనెలాఖరులోగా నియమించనున్నారు. ఇక ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు ప్రారంభించే అవకాశాలు కనపడుతున్నాయి. కోదండరామ్ నేతృత్వంలో విద్యా శాఖను, ఉద్యోగ రిక్రూట్ మెంట్లను సమర్థవంతంగా నిర్వహించేలా రేవంత్ ప్రణాళిక రచిస్తున్నారు.

Exit mobile version