Priya Prakash Warrior : విదేశీ వీధుల్లో ప్రియా ప్రకాశ్ వారియర్.. సెగలు పుట్టిస్తు్న్న హీరోయిన్
Priya Prakash Warrior : ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్. ఆ తర్వాత ఆమెకు సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఆమె మొదటి సినిమా ‘ఒరు అదార్ లవ్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత కూడా ఆమె నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అవకాశాలు పూర్తిగా తగ్గాయి. ఇది పక్కన పెడితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ భామ రీసెంట్ గా కొన్ని ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. అవి వైరల్ గా మారుతున్నాయి.
2018 ‘నీ వానం నాన్ మఝాయ్’ రిలీజ్‌కి ముందే స్టార్ డమ్ దక్కించుకున్న ఈ బ్యూటీకి సిల్వర్ స్క్రీన్ కలిసిరావడం లేడట. 2018లో రావాల్సిన ‘శ్రీదేవీ బంగ్లా’ సినిమా కోర్టు కేసుల్లో చిక్కుకుంది. వింక్ గర్ల్ (కన్ను గీటిన యువతి)గా గుర్తింపు సంపాదించుకున్న కేరళ కుట్టి బాల్యం నుంచే క్లాసికల్ డాన్సర్. వెండితెరపై వెలుగు వెలగాలనే ఆశతో ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రియా వారియర్ 7.1 మిలియన్ ఫాలోవర్స్‌తో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కలిగి ఉంది.
ప్రస్తుతం ఈ భామకు అవకాశాలు పెద్దగా లేవు.. ఇన్ స్టాలో యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌కు టచ్‌లో ఉంటోంది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ.. తన అభిమానులను ఆనందం పంచుతుంది. తాజాగా కొన్ని ఫొటోలను పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫొటోలు మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ భామ చాలా రోజులకు తెలుగులో పవన్ కళ్యాణ్ ‘బ్రో..: ది అవతార్‌లో’ కనిపించింది. ఇది కూడా జస్ట్ ఓకే అనిపించుకుంది.
ప్రియా ప్రకాష్ తెలుగులో నితిన్ సరసన ‘చెక్’తో పలకరించింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. దీంతో తెలుగులో పాగా వేయాలనుకున్న ప్రియా ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. ఇప్పటికీ సరైన అవకాశం కోసం ఎదురు చూస్తోంది.