Private Vs Govt : ప్రైవేట్ వర్సెస్ గవర్నమెంట్.. యుద్ధం మెుదలెట్టిన టెలికాం కంపెనీలు

Private Vs Govt

Private Vs Govt Telecom Companies

Private Vs Govt : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలను అమాంతం పెంచేశాయి. దాంతో ప్రైవేట్ టెలికం కంపెనీల యూజర్లు అంత మొత్తంలో రీఛార్జ్ ప్లాన్లను కొనుగోలు చేయలేక భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వైపు ఆసక్తి చూపిస్తున్నారు. జియో, ఎయిర్‌టెల్ టారిఫ్‌ ధరల పెంపు తర్వాత బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది.

జూలై 3 నుంచి జూలై 4 తేదీలలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు-రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ మొబైల్ టారిఫ్‌లను 11శాతం నుంచి 25 శాతం మేర పెంచాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ‘బీఎస్ఎన్ఎల్‌కి ఘర్ వాప్సీ’ ‘BoycottJio’ వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. ఈ టారిఫ్ పెంపు తర్వాత  మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP)ని ఉపయోగించి 2.50లక్షల మంది బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు మారారు. బీఎస్ఎన్ఎల్ కూడా దాదాపు 2.5 మిలియన్ కొత్త కనెక్షన్‌లను అందుకుంది. ఎందుకంటే.. ఈ ప్రభుత్వం టెలికం దిగ్గజం మొబైల్ టారిఫ్‌లు ఇప్పటికీ తక్కువ ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

దేశంలోని అనేక ప్రాంతాల్లో BSNL సిమ్ కార్డులకు డిమాండ్ బాగా పెరిగింది. 4G సర్వీస్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై కంపెనీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ వీలైనంత త్వరగా 4జీ, 5జీ సేవలను ప్రారంభిస్తామని మంత్రి జ్యోతిరాధిత్య సింధియా హామీ ఇచ్చారు. దేశంలోని కోట్లాది మంది వినియోగదారులకు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టాటాలు ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ కు సహకరిస్తున్నారు.

ఈ క్రమంలో తేజస్, బీఎస్ఎన్ఎల్, టీసీఎస్, సీడీఓటీ కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయని సింధియా పేర్కొన్నారు. భారత్‌లో సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. గడచిన ఏడాది దేశీయ టెలికాం పరికరాల ఎగుమతులు రూ.20,000 కోట్లకు చేరువయ్యాయని చెప్పారు. టాటాలు 4జీ సాంకేతిక అభివృద్ధితో పాటు దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు కసరత్తులు చేస్తున్నారు. టాటాల సహకారంతో BSNL దేశవ్యాప్తంగా 9000 కంటే ఎక్కువ 4G నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తోంది.

TAGS