Bus Accident : ప్రైవేటు బస్సు బోల్తా – ఇద్దరు మృతి, 40 మందికి గాయాలు

Bus Accident
Bus Accident : ఓ ప్రైవేటు బస్సు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో బోల్తాపడిన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు చనిపోగా, 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్తున్న బస్సు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. బోల్తాపడిన బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను స్థానికులు కష్టపడి బయటకు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన చిన్నారులు హైదరాబాద్ కు చెందిన లక్ష్మీ (13), గోవర్ధిని (8)గా గుర్తించారు. బస్సు డ్రైవర్ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో వేగంగా నడపడంతో కోడుమూరు-ప్యాలకుర్తి మధ్య ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.