ESI Metro station : హైదరాబాద్ ఈఎస్ఐ మెట్రో స్టేషన్ వద్ద ప్రైవేటు బస్సు బీభత్సం

ESI Metro station
Hyderabad ESI Metro station : హైదరాబాద్ లో ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ ఈఎస్ఐ మెట్రో స్టేషన్ వద్ద అతి వేగంతో దూసుకొచ్చిన గో టూర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు కారును ఢీకొట్టింది. అనంతరం కారును ఈడ్చుకెళ్లింది. వాహనదారులు, జనం కేకలు వేయడంతో కారులో నుంచి డ్రైవరు బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గో టూర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు బళ్లారి నుంచి హైదరాబాద్ కు బయలుదేరింది. బస్సులోని ప్రయాణికులంతా తమ తమ గమ్యాలకు చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈఎస్ఐ మెట్రో స్టేషన్ వద్ద అతి వేగంతో దూసుకొస్తున్న బస్సు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. మరోవైపు ఎంతో నిర్లక్ష్యంతో బస్సు దూసుకురావడంతో వాహనదారులు, పాదాచారులు భయంతో పరుగులు పెట్టారు. ఎట్టకేలకు కారు డ్రైవరు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ట్రావెల్ బస్సును, కారును అక్కడి నుంచి తరలించారు. కారు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.