JAISW News Telugu

PM Candidate : ప్రధాని అభ్యర్థి అతనే.. జాతీయ కార్యవర్గ భేటీలో ఫైనల్..

PM Candidate

PM Candidate

PM Candidate : సార్వత్రిక (లోక్‌సభ) ఎన్నికలకు ఇంకా నెలల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. అధికార పార్టీ కావడంతో మరో సారి పాలనా పగ్గాలు చేపట్టాలని భావిస్తోంది. దీని కోసం ఎజెండాను చూపొందించుకొని పని చేస్తుంది.

దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండప్ వేదికగా జరుగుతున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అన్ని రాష్ట్రాల కార్యదర్శులు, పదాధికారులు పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, వివిధ రాష్ట్రాలకు చెందిన అధ్యక్షులు హాజరయ్యారు.

సమావేశాల్లో భాగంగా రెండో రోజు ప్రధాని నరేంద్ర మోడీని వారంతా కలిసి సన్మానించారు. మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తో పాటు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. నరేంద్ర మోడీకి నిలువెత్తు పూలమాల వేసి సత్కరించారు. మోదీజీకి జై.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. మోదీనే తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా తిరిగి ప్రకటించినట్టయింది.

తర్వాత అమిత్ షా మాట్లాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 400 లోక్‌సభ స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అవలీలగా సాధిస్తామని ధీమాగా చెప్పారు. మోదీని మరోసారి ప్రధానిగా ఎన్నుకునేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, మూడోసారి ఆయన దేశానికి నాయకత్వం వహిస్తారని అన్నారు. ఇందులో ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని సూచించారు.

స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల్లో 17 సార్లు లోక్‌సభకు ఎన్నికలు, 22 ప్రభుత్వాలు, 15 మంది ప్రధానులు వచ్చారన్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడూ చూడని డెవలప్ మెంట్ కేవలం 10 సంవత్సరాల్లో మోడీ హయాంలో జరిగిందని షా అన్నారు. మోడీ పాలనలో ప్రతీ రంగం అభివృద్ధి చెందిందని, ప్రతి వ్యక్తి అవసరాలను ప్రభుత్వం నెరవేర్చిందని షా చెప్పారు.

ప్రతిపక్షాల కూటమి I.N.D.I.A.. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఖతం చేసిందని ఆరోపించారు అమిత్ షా. అత్యంత అవినీతి పాలనను దేశానికి అందించిందని విమర్శించారు. అవినీతి, బంధు ప్రీతి, బుజ్జగింపులు, కులతత్వంతో ఇన్నాళ్లు పాలించారని ధ్వజమెత్తారు. దీన్ని నిర్మూలించి.. ఈ 10 సంవత్సరాల్లో మోదీ ఎంతో అభివృద్ధి సాధించారని ప్రశంసించారు.

Exit mobile version