Pakistan PM : నరేంద్ర మోదీకి పాక్ ప్రధాని శుభాకాంక్షలు

Pakistan PM Shehbaz Sharif – PM Modi
Pakistan PM : ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించి ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఏడు పొరుగు దేశాలను ఆహ్వానించినప్పటికీ, పాకిస్థాన్ కు మాత్రం భారత్ ఆహ్వానం పంపలేదు. దీంతో పాక్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది.
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఇటీవల శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిగా ధన్యవాదాలు తెలిపిన పీఎం మోదీ, పరస్పర అవగాహన, ఇరు దేశాల ఆందోళనలను అర్థం చేసుకుంటూ, కెనడా పని చేసేందుకు భారత్ ఎదురుచూస్తోందని చెప్పారు.