PM Modi : జమ్మూ కశ్మీర్లో ఈరోజు 32 వేల కోట్ల రూపాయ ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తూ కుటుంబ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్ అనేక దశాబ్దాలుగా రాజవంశ రాజకీయాల బాధితురాలిగా ఉందన్నారు. వంశపారంపర్య రా జకీయాలు చేస్తున్న వారు తమ ప్రయోజనాల కోసం మాత్రమే చూసుకున్నారు తప్ప మీ ప్రయోజ నాలను పట్టించుకోలేదని పేర్కొ్న్నారు.
వంశపారంపర్య రాజకీయాల వల్ల ఎక్కువగా నష్టపోయింది యువతేనని వెల్లడించారు. తమ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తులు మీ కుటుంబం గురించి చింతించరని చెప్పారు. గురువింద దాని మీద ఉన్న నలుపు చూసుకోకుండా పక్కన వాటి మీద విమర్శలు చేస్తున్నట్లు పాపం సోగానికి పైగా బీజేపీ ముఖ్య నేతలు వంశపారంపర్య రాజకీయాలు చేస్తున్నారు అని మర్చిపోయినట్టు ఉన్నారు నరేంద్ర దాస్ మోడీ.