PM Modi : ‘మోదీ కా పరివార్ తొలగించండి’ జాతికి ప్రధాని మోదీ తొలి విజ్ఞప్తి

PM Modi

PM Modi

PM Modi : బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. ప్రజల సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెట్టిన ‘మోదీ కా పరివార్’ అనే పదాన్ని తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.

మార్చిలో, చాలా మంది బీజేపీ సభ్యులు, మోడీ అభిమానులు, మద్దతుదారులు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో తమ పేరు పక్కన ‘మోడీ కా పరివార్ (మోడీ కుటుంబం)’ అనిపెట్టుకున్నారు. మోడీకి సొంత కుటుంబం లేదని ప్రతిపక్ష నేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించడంతో ఈ ఉద్యమం ప్రారంభమైంది.

‘ఎన్నికల ప్రచారం ద్వారా, భారతదేశం అంతటా ప్రజలు నాపై ఉన్న అభిమానంతో తమ సోషల్ మీడియాలో ‘మోడీ కా పరివార్’ను జోడించారు. దీనితో తాను చాలా బలంగా పోరాడగలిగాను. భారత ప్రజలు ఎన్డీయేకు వరుసగా మూడోసారి మెజారిటీ ఇచ్చారని, దేశ శ్రేయస్సు కోసం కృషి చేయాలని మాకు ఆదేశాన్ని ఇచ్చారని’ మోడీ అన్నారు.

మనమందరం ఒకే కుటుంబం అనే సందేశాన్ని సమర్థవంతంగా తెలియజేసినందున నేను మరోసారి భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ సోషల్ మీడియా అకౌంట్లనుంచి ‘మోడీ కా పరివార్’ను తొలగించమని అభ్యర్థిస్తున్నాను. భారతదేశ పురోగతి కోసం కృషి చేస్తున్న ఒక పరివారంగా మా బంధం బలంగా, విచ్ఛిన్నం కాకుండా ఉంది. అని మోడీ తన అభిమానులను ఉద్దేశించి అన్నారు.

ప్రధాని తన ‘ఎక్స్’ హ్యాండిల్ లో ప్రొఫైల్, హెడ్డర్ ఫోటోలను కూడా మార్చారు. ఆయన అధికారంలోకి వచ్చిన తొలిరోజు, మూడోసారి ఆయన ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఫొటోలు తాజాగా ఏర్పాటు చేశారు.

TAGS